Andhra Pradesh: తాటాకు చప్పుళ్లకు భయపడను.. వైసీపీ పాలనపై చంద్రబాబు ఫైర్
ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో(Nellimarla) నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ నేతలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు....
ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో(Nellimarla) నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ నేతలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్(CM Jagan) పాలనలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు పెంచి పేదలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణకు సారా వ్యాపారం మాత్రమే తెలుసునని.. అలాంటి వ్యక్తికి విద్యాశాఖను కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలకు స్థలాలు, ఇళ్లు ఇవ్వడం లేదని, ఇళ్లు కట్టుకున్న వారికి బిల్లులు ఇవ్వడం లేదని ఆక్షేపించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. విజయనగరం అంటే అశోక్ గజపతిరాజు కుటుంబం గుర్తుకొస్తుందని.. అలాంటి వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టి వేధించారని వైసీపీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు కొనసాగుతోంది. గత టీడీపీ పాలనలో కరెంటు ఛార్జీలు పెంచకుండా కరెంటు ఇచ్చాం. కానీ ఇప్పుడు కరెంటే రావడం లేదు. మద్యం, పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రజల పొట్ట కొట్టిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ప్రత్యేక హోదా వస్తుందని, అందరికీ ఉద్యోగాలు ఇస్తానని జగన్ చెప్పారు. పదో తరగతిలో విద్యార్ధులు ఎందుకు ఫెయిలయ్యారని ప్రశ్నిస్తే తల్లితండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టలేదని బొత్స చెప్తున్నారని, ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి. జగన్ గురువుల్ని ఎప్పుడు కించపరిచారో అప్పుడే విద్యావ్యవస్ధ నాశనమైంది. టీడీపీ పాలనలో టీచర్లు, పోలీసుల ఉద్యోగాలిస్తే ఇప్పుడు మాత్రం 5 వేలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు.
– చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి