China: మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా.. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతు

డ్రాగన్ దేశం చైనా మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. పాక్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని యూఎన్ఎస్సీ జాబితాలో చేర్చాలన్న భారత్, అమెరికా సంయుక్త ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ జాబితాను...

China: మరోసారి వక్రబుద్ధి చాటుకున్న చైనా.. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతు
China
Follow us

|

Updated on: Jun 17, 2022 | 8:06 PM

డ్రాగన్ దేశం చైనా మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. పాక్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని యూఎన్ఎస్సీ జాబితాలో చేర్చాలన్న భారత్, అమెరికా సంయుక్త ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ జాబితాను చైనా చివరి నిమిషంలో ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంది. భద్రతా మండలిలోని అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని భారత్, అమెరికా డిమాండ్ చేశాయి. దీనికి సముఖత తెలిపిన ఐక్యరాజ్యసమితి.. చివరి క్షణంలో చైనా అడ్డంకితో నిలిపివేసింది. అంతకు ముందు కూడా చైనా ఇలాంటి ఘటనలకే పాల్పడడం గమనార్హం. 2019 మే లో గ్లోబల్ బాడీ పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. యూఎన్ భద్రతా మండలిలో వీటో-శక్తిగల శాశ్వత సభ్యుడు, అజార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చే ప్రయత్నంలో 15 దేశాలలో చైనా మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది.

2016 జనవరిలో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి ప్రధాన సూత్రధారి అయిన మసూద్ అజార్‌ను నిషేధించాలని అమెరికా, యూకే, ఫ్రాన్స్‌లతో కలిసి ఐరాస 1267 ఆంక్షల కమిటీకి ప్రతిపాదనను పంపింది. 2017లో మళ్లీ ఇదే ప్రతిపాదనను చేయగా.. అన్ని సందర్భాల్లో వీటో అధికారంతో భారత ప్రతిపాదనను ఆంక్షల కమిటీ ఆమోదించకుండా చైనా అడ్డుకుంది. అబ్దుల్ రెహ్మాన్ మక్కీని 2010 నవంబరులో అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మక్కీ గురించి సమాచారం ఇస్తే 2 మిలియన్ డాలర్లు రివార్డును అందజేస్తామని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest Articles
తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ
తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ
భారత్‌లో మరోసారి భూ కంపం హడల్‌..! ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా..
భారత్‌లో మరోసారి భూ కంపం హడల్‌..! ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా..
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర