NCERT Text books: వివాదాస్పదంగా సీబీఎస్సీ సిలబస్‌ కుదింపు ప్రక్రియ! దీని వెనుక రాజకీయ ఎజెండా ఉన్నట్లేనా?

కోవిడ్‌ 19 కారణంగా విద్యార్ధులపై భారాన్ని తగ్గించాలనే నేపథ్యంతో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త సిలబస్‌ను కుదించినట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) గురువారం (జూన్ 16) ప్రకటించింది..

NCERT Text books: వివాదాస్పదంగా సీబీఎస్సీ సిలబస్‌ కుదింపు ప్రక్రియ! దీని వెనుక రాజకీయ ఎజెండా ఉన్నట్లేనా?
Cbse Syllabus
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 18, 2022 | 11:06 AM

NCERT reduces syllabus for 6th to 12 classes: కోవిడ్‌ 19 కారణంగా విద్యార్ధులపై భారాన్ని తగ్గించాలనే నేపథ్యంతో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి కుదించిన కొత్త సిలబస్‌ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) గురువారం (జూన్ 16) ప్రకటించింది. కొత్త సిలబస్‌ ప్రకారం.. గుజరాత్ అల్లర్లు 2002, ప్రచ్ఛన్నయుద్ధం, మొఘల్ సాంమ్రాజ్యం వంటి కీలక అంశాలను 12వ తరగతి టెక్స్ట్‌ బుక్కుల నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించింది. 11వ తరగతిలో పారిశ్రామిక విప్లవం, 7వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి దళిత రచయితల పాఠ్యాంశాలను తొలగించింది. కోవిడ్‌ 19 నేపథ్యంలో ఈ ఏడాది 6 నుంచి 12వ తరగతి సిలబస్‌లో 30 శాతం మేర సిలబస్‌కు కోత విధించినట్లు ఎన్సీఈఆర్టీ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్‌ నుంచి చేపట్టిన సిలబస్ రేషనలైజేషన్‌ పూర్తయ్యినట్లు, ఆయా సబ్జెక్ట్ నిపుణుల సూచనల మేరకు సిలబస్‌ను తగ్గించినట్లు పేర్కొన్నారు.

  • కొత్త సిలబస్‌ ప్రకారం..12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో రీసెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ అనే చాప్టర్ నుంచి ‘గుజరాత్ అల్లర్లు (Gujarat Riots)’ అనే పాఠ్యాంశాన్ని తొలగించారు.
  • 12వ తరగతి చరిత్ర టెక్స్ట్‌ బుక్‌ నుంచి మొఘల్ సామ్రాంజ్యానికి చెందిన అన్ని ఛాప్టర్లు, ‘దళిత్ మూవ్‌మెంట్’, పొలిటికల్ సైన్స్ నుంచి ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) అంశాలను తొలగించారు.
  • 11వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకంలో ‘సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్’, ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనే ఛాప్టర్లను ఎత్తివేశారు.
  • 7, 8 తరగతుల సోషల్‌ సైన్స్‌ టెక్స్ట్‌ బుక్స్‌ (social science textbook) నుంచి దళిత రచయిత ఓంప్రకాష్ వాల్మీ పాఠ్యాంశాన్ని తొలగించారు. 7వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘Our Pasts-2’ (మొఘల్ చక్రవర్తులకు సంబంధించినవి సంఘటనలు) అనే పాఠ్యాంశాన్ని మినహాయించారు.

మరోవైపు సిలబస్‌ రేషనలైజేషన్‌పై వివరణ ఇవ్వడానికి ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ నిరాకరించారు. ఆయన బాధ్యతలు చేపట్టడానికి ముందే రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, అందుకే ఈ విషయమై మాట్లాడదలచుకోలేదని ఆయన అన్నారు. ఐతే విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషంపై మాట్లాడుతూ.. సబ్జెక్టు నిపుణులతో చర్చించిన తర్వాతనే సిలబస్‌ను కుదించామని, తొలగించిన అంశాలు గతంలో విద్యార్ధులు చదివినవేనని, రాబోయే తరగతుల్లో కూడా ఆయా అంశాలను అధ్యయనం చేస్తారని, సెలక్టివ్‌గా ఏ టాపిక్‌ను తొలగించలేదన్నారు.

అంతేకాకుండా ఎన్సీఈఆర్టీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఒకే తరగతిలో ఇతర సబ్జెక్టుల్లో రిపీట్‌ అయ్యే అంశాలు లేదా లోయర్‌/హైయర్ క్లాసుల్లో చదివిన పాఠ్యాంశాలను క్లిష్టత ఆధారంగా తొలగించామని తెల్పింది. కంటెంట్ లోడ్‌ను తగ్గించి, తద్వారా క్రియేటివ్‌ మైండ్‌సెట్‌ను పెంపొందించే ఎక్స్పరిమెంటల్‌ అభ్యాసానికి అవకాశం కల్పించాలన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020)కి అనుగుణంగా సిలబస్‌ను కుదించినట్లు, ప్రతి సబ్జెక్టులో ఏయే అంశాలను తొలగిస్తున్నారో తెలియజేస్తూ వివరణాత్మక నోట్‌ను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది ఏప్రిలోనే సీబీఎస్సీ సిలబస్‌ కుదింపు అంశాలను సీబీఎస్సీ ప్రకటించింది. సీబీఎస్సీ స్కూళ్లలో బోధించే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి మతాలకు, రాజకీయాలకు, లౌకిక రాజ్యం వంటి ప్రత్యేక అంశాలను మాత్రమే తొలగించడంపై ఢిల్లీ యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గళం విప్పారు. ఈ విధమైన పాఠ్యాంశాల కుదింపు వెనుక రాజకీయ శక్తుల ఎజెండా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ రాజకీయ ఎజెండాను అన్ని పాఠశాలలు, కాలేజీల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.