AP Polycet Results 2022: ఏపీ పాలిసెట్‌ ఫలితాల విడుదల.. ఇక్కడ రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి..

AP Polycet Results 2022: పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌లో ఈ రిజల్ట్స్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

AP Polycet Results 2022:  ఏపీ పాలిసెట్‌ ఫలితాల విడుదల.. ఇక్కడ రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి..
Results
Follow us
Basha Shek

| Edited By: Team Veegam

Updated on: Jun 18, 2022 | 11:38 AM

AP Polycet Results 2022: పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాలు  విడుదలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌లో ఈ రిజల్ట్స్‌ను విడుద‌ల చేశారు. రిజిస్ట్రేషన్ నెంబర్‌‌ను ఎంటర్ చేయడం ద్వారా పాలిసెట్‌ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా 2022-23 విద్యాసంవత్సరానికిగాను మే 29న రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్‌ ప్రవేశపరీక్ష జరిగింది. ఇక ఈ పరీక్ష కోసం 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు  హాజరయ్యారు. ఇప్పటికే పాలిసెట్‌ ఆన్సర్‌ కీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) విడుదల చేసిన విషయం తెలిసిందే.

ర్యాంక్ కార్డ్ కూడా..

కాగా పాలిసెట్‌ ఫలితాలతో పాటు ర్యాంక్‌ కార్డ్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అర్హత మార్కుల్లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకులను కేటాయిస్తారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని ఇదివరకే బోర్డ్ తెలిపింది. ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈసారి కూడా అమ్మాయిలదే అగ్రస్థానం..

కాగా ఈసారి 1, 31 , 608 మంది పాలిసెట్ పరీక్షకు హాజరు కాగా..  1, 20, 866 మంది ఉత్తీర్ణులయ్యారు. పాస్ పర్సెంటేజ్  91.84 శాతంగా నమోదైంది. రాజమండ్రికి కి చెందిన చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంక్ కైవసం చేసుకోగా.. కాకినాడకు చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాంత్ రెండో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. కాకినాడ కి చెందిన టెంకని సాయి భవ్య శ్రీ మూడో స్థానంలో నిలిచింది. కాగా ఈసారి కూడా అమ్మాయిలే అగ్రస్థానంలో నిలవడం విశేషం. వారి పాస్ పర్సంటేజ్ 93.96 కాగా.. 90.56 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..