AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..సింగరేణిలో 177 క్లర్క్‌ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌.. ఆ జిల్లాల వారికి బంపరాఫర్‌..

Jobs in Singareni: తెలంగాణ నిరుద్యోగులకు సింగరేణి (Singareni) యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు (Externel clerks) పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది..

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..సింగరేణిలో 177 క్లర్క్‌ పోస్ట్‌లకు నోటిఫికేషన్‌.. ఆ జిల్లాల వారికి బంపరాఫర్‌..
Telangana Jobs
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 17, 2022 | 3:51 PM

Share

Jobs in Singareni: తెలంగాణ నిరుద్యోగులకు సింగరేణి (Singareni) యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. 177 ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు (Externel clerks) పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌, డైరెక్టర్‌ బలరామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్ష ద్వారానే..

కాగా రా ష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాల్లో 95శాతం స్థానిక అభ్య ర్థులకు అవకాశం కల్పించారు. అంటే ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5శాతం పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌ కోటా కింద అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పి స్తారు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు లను ఈనెల 20 నుంచి జూ లై 10వరకు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించనున్నారు. ఈనోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం సింగరేణి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

Jobs In Singareni

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..