Ranji Trophy 2022: రంజీట్రోఫీలో అదరగొడుతోన్న క్రీడా మంత్రి.. వరుసగా రెండో శతకం బాదిన వెటరన్‌ ప్లేయర్‌..

Ranji Trophy 2022 Semifinal:: రంజీ ట్రోఫీ- 2022లో బెంగాల్‌ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి (Manoj Tiwary) అదరగొడుతున్నాడు. క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్‌ ప్రకటించకముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆటగాడు..

Ranji Trophy 2022: రంజీట్రోఫీలో అదరగొడుతోన్న క్రీడా మంత్రి.. వరుసగా రెండో శతకం బాదిన వెటరన్‌ ప్లేయర్‌..
Manoj Tiwary
Follow us

|

Updated on: Jun 16, 2022 | 1:43 PM

Ranji Trophy 2022 Semifinal:: రంజీ ట్రోఫీ- 2022లో బెంగాల్‌ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి (Manoj Tiwary) అదరగొడుతున్నాడు. క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్‌ ప్రకటించకముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆటగాడు జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లోనూ అతను అర్ధసెంచరీ బాదాడు. తాజాగా మరోసారి మూడంకెల స్కోరును అందుకున్నాడు తివారి. తాజాబా బెంగళూరు వేదికగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌ పోరులో కీలక సమయంలో సెంచరీతో మెరిశాడు. మొత్తం 211 బంతులు ఎదుర్కొన్న అతను 12 ఫోర్ల సహాయంతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనితో పాటు మరో షాబాజ్‌ అహ్మద్‌ కూడా సెంచరీ సాధించాడు. 209 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 116 పరుగులు చేసిన షాబాజ్‌ ఔట్‌ కాగానే బెంగాల్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 68 పరుగుల ఆధిక్యం సంపాదించింది మధ్య ప్రదేశ్‌. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌ లో 341 పరుగులకు ఆలౌటైంది మధ్యప్రదేశ్‌. హిమాన్షు మంత్రి 165 పరుగులు చేశాడు. 68 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఎంపీ 19 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది.

కాగా ప్రస్తుతం బెంగాల్‌ క్రీడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు మనోజ్‌. పశ్చిమ బెంగాల్‌లోని షిబ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో అతను విజయం సాధించాడు. క్రికెట్‌పై ఆసక్తితో ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరు రిజిస్టర్ చేయించుకున్నా.. ఏ జట్టూ అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఇక టీమిండియా తరుపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడిన మనోజ్ వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 119 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి, 51.78 సగటుతో మొత్తం 8, 752 రన్స్‌ చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిసారిగా ఐపీఎల్‌ 2018 సీజన్‌లో బరిలోకి దిగాడు. ఆతర్వాత రాజకీయాలతో బిజీగా మారిపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..