ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించింది. అయితే ఇప్పుడు మూడో టీ20లో ఓడిపోవడంతో సిరీస్ కైవసం చేసుకోవడం కష్టతరంగా మారింది. ఐపీఎల్-2022లో ఐడెన్ మర్‌క్రమ్ భారీగా పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 400కు పైగా పరుగులు సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు ఆఫ్‌స్పిన్‌తోనూ సత్తా చాటగలడీ స్టార్ ప్లేయర్.
1 / 6
కాగా మర్‌క్రమ్ లేకపోయినా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. ఈ కారణంగానే తొలి టీ20లో ఆతిథ్య జట్టు 211 పరుగులను సులభంగా ఛేదించింది.
2 / 6
భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోనా కారణంగా మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఆడని స్టార్ ఆటగాడు ఐడన్ మర్‌క్రమ్ మిగతా రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.
3 / 6
మర్‌క్రమ్‌కు కొవిడ్ సోకినట్లు తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ప్రకటించింది క్రికెట్ సౌతాఫ్రికా. అయితే, జట్టులోని ఇతర సభ్యులెవరూ వైరస్ బారిన పడకపోవడంతో సిరీస్‌పై దాని ప్రభావం కనిపించలేదు. ఇప్పటివరకు ఐసోలేషన్‌లో ఉన్న మర్‌క్రమ్ తాజాగా స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు.
4 / 6
దక్షిణాఫ్రికా టీ20 జట్టులో మర్‌క్రమ్ కీలక ఆటగాడు. మొత్తం20 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను 39 సగటు, 147 స్ట్రైక్‌రేట్‌తో 588 పరుగులు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా కూడా 5 వికెట్లు తీశాడు.
5 / 6
ఫామ్ లో ఉన్న మర్ క్రమ్ మిగతా రెండు కీలక మ్యాచ్ లకు సఫారీలకు ఎదురుదెబ్బే.