- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips Lal Chandan Do these upay with red sandalwood Know the Details
Lal Chandan: ఎర్రచందనంతో ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ధనప్రాప్తి కలుగుతుందట..!
హిందూ మత ఆచారాల ప్రకారం.. పూజ సమయంలో ఎర్రచందనంను తిలకంగా వినియోగిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎర్ర చందనంతో అనేక రకాల పరిహారాలు కూడా చేయవచ్చు. జీవితంలోని అనేక ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఇది ఉపకరిస్తాయి.
Updated on: Jun 16, 2022 | 6:30 AM

హిందూ మత ఆచారాల ప్రకారం.. పూజ సమయంలో ఎర్రచందనంను తిలకంగా వినియోగిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎర్ర చందనంతో అనేక రకాల పరిహారాలు కూడా చేయవచ్చు. జీవితంలోని అనేక ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఇది ఉపకరిస్తాయి.

సంతోషం, శ్రేయస్సు: శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎర్రచందనంతో పూజించండి. అలా చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆనందం, శ్రేయస్సు సిద్ధిస్తుంది. అలాగే, ప్రతి శుక్రవారం నాడు నుదిటిపై తిలకం పెట్టుకోవాలి.

సమస్యల నుండి బయటపడటానికి: ఎర్రచందనం దండతో అమ్మవారి శ్లోకాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఆనందాన్ని తెస్తుంది.

వ్యాపారంలో పురోగతి సాధించడానికి: మంగళవారం నాడు 11 శుభ్రమైన రావి ఆకులపై ఎర్రచందనంతో శ్రీరామును పేరు రాయాలి. ఈ ఆకులను మాలగా తయారు చేసి హనుమంతుడికి వేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు.

ధన లాభం: కొన్నిసార్లు చాలా కష్టపడినా కూడా విజయం వరించదు. అలాంటి పరిస్థితిలో.. ఎర్రటి వస్త్రంలో ఎర్ర గులాబీ పువ్వులు, రోలీ, ఎర్ర చందనం కట్టాలి. ప్రతి 6 నెలలకోసారి మార్చుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.