SL vs AUS: 51 బంతుల్లో 80 రన్స్‌.. 156 స్ట్రైక్‌రైట్‌తో తుపాన్‌ ఇన్నింగ్స్‌.. బౌలర్ల భరతం పట్టిన స్టార్ ప్లేయర్..

SL vs AUS 1st ODI: ఇప్పటికే టీ 20 సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకున్న శ్రీలంక జట్టు మొదటి వన్డే మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. పల్లెకల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆ జట్టు రెండు వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌) కంగారూల చేతిలో ఓటమిపాలైంది..

SL vs AUS: 51 బంతుల్లో 80 రన్స్‌.. 156 స్ట్రైక్‌రైట్‌తో తుపాన్‌ ఇన్నింగ్స్‌.. బౌలర్ల భరతం పట్టిన స్టార్ ప్లేయర్..
Sl Vs Aus
Follow us
Basha Shek

|

Updated on: Jun 15, 2022 | 12:57 PM

SL vs AUS 1st ODI: ఇప్పటికే టీ 20 సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకున్న శ్రీలంక జట్టు మొదటి వన్డే మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. పల్లెకల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు రెండు వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌) కంగారూల చేతిలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోరు చేసింది. కుషాల్‌ మెండిస్‌ 86 నాటౌట్‌, పాతుమ్‌ నిస్సాంక 56, గుణతిలక 55 రాణించారు. చివర్లో హసరంగా 19 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ అనంతరం సుమారు 90 నిమిషాల పాటు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఆసీస్‌ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 282 పరుగులుగా నిర్ణయించారు. ఛేజింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 44, స్టీవ్‌ స్మిత్‌ 53 పరుగులతో ఆదుకున్నారు. ఆ తర్వాత లబుషేన్‌ 24, మార్కస్‌ స్టోయినిస్‌ 44, అలెక్స్‌ క్యారీ 21 పరుగుల తో తలా ఓ చేయి వేశారు. అయితే మ్యాచ్‌లో అసలు హైలైట్‌ మ్యాక్స్‌వెల్‌ మెరుపు ఇన్నింగ్సేనని చెప్పుకోవచ్చు.

కడదాకా క్రీజులో నిలిచి..

మొత్తం 51 బంతులు ఎదుర్కొన్న మ్యాక్సీ 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సహాయంతో 81 పరుగులు చేశాడు. సహచరులు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా చివరి వరకు క్రీజులో ఉండి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనిని ఔట్‌ చేసేందుకు శ్రీలంక బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అతని చలవతో 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది ఆసీస్‌. కాగా పరిమిత ఓవర్లలో మ్యాక్సీకిది 23వ అర్ధ సెంచరీ. తుపాన్‌ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Diabetes in Kids: పిల్లల్లో ఈ అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయా.. డయాబెటీస్ టైప్ 1 కావొచ్చేమో..

Indian Railways: అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్యాంట్రీకార్లలో గ్యాస్‌ సిలిండర్లకు బదులు..

India Corona: దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. మళ్లీ భారీగా పెరిగిన కొత్త కేసులు.. మూడు నెలల తర్వాత ఇవే అత్యధికం..