AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన.. అయినా, ఐర్లాండ్ సిరీస్‌కు నో ఛాన్స్.. షాక్ అయ్యానంటూ కామెంట్స్..

ఐర్లాండ్‌పై ఎంపిక కాకపోవడంతో ఈ ప్లేయర్ షాక్‌కు గురయ్యాడు. ఈమేరకు తన మనసులోని మాటలను సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

IND vs IRE: ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన.. అయినా, ఐర్లాండ్ సిరీస్‌కు నో ఛాన్స్.. షాక్ అయ్యానంటూ కామెంట్స్..
Ind Vs Ire
Venkata Chari
|

Updated on: Jun 16, 2022 | 2:52 PM

Share

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌(IND vs SA)లో ఎంపికకాని ప్లేయర్లు.. ఐర్లాండ్‌(IND vs IRE) సిరీస్‌లోనైనా అవకాశం వస్తుందని భావించారు. కానీ, ఈసారి కూడా వారికి నిరాశే తప్పలేదు. అందులో రాహుల్ తెవాటియా పేరు కీలకంగా వినిపించింది. ఈ ఆల్ రౌండర్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కష్టంగా మారింది. ఐర్లాండ్‌కు వ్యతిరేకంగా ఎంపిక కాకపోవడంతో అతను చాలా బాధపడ్డాడు. షాక్‌కు గురయ్యానని తెలిపాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వినిపించాడు.

ఐర్లాండ్ పర్యటన కోసం భారత జట్టులో 17 మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్ల సైన్యం ఉంది. అయితే అందులో రాహుల్ తెయోటియా పేరు లేదు. మరోవైపు రాహుల్ త్రిపాఠికి తొలిసారిగా అవకాశం దక్కింది. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ కూడా తిరిగి వచ్చారు. ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్సీ బాధ్యత హార్దిక్ పాండ్యా భుజస్కంధాలపై ఉంది.

మెరుగైన ఆట.. అయినా తప్పిన అంచనాలు..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2022లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో రాహుల్ తెవాటియా సభ్యుడిగా ఉన్నాడు. ఈ సీజన్‌లో ఈ జట్టు కోసం అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. గుజరాత్‌ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. కొన్నిసార్లు మిల్లర్‌తో, మరి కొన్నిసార్లు రషీద్ ఖాన్‌‌తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే అంతటి అద్భుత ప్రదర్శన తర్వాత రాహుల్ తెవాటియా అనుకున్నది జరగకపోవడంతో చాలా బాధపడ్డాడు. ఈమేరకు రాహుల్ తెవాటియా ట్వీట్ చేశాడు.’అంచనాలు దెబ్బతిన్నాయి’ అంటూ రాసుకొచ్చాడు.

ఐపీఎల్ 2022లో ప్రదర్శన..

ఐపీఎల్ 15వ సీజన్‌లో 147.62 స్ట్రైక్ రేట్‌తో రాహుల్ తెవాటియా 16 మ్యాచ్‌ల్లో మొత్తం 217 పరుగులు చేశాడు. అతను ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఫినిషర్ పాత్రను పోషించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను రెండు వరుస సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు.

ఐర్లాండ్‌తో 2వ టీ20కి భారత జట్టు..

ఐర్లాండ్ పర్యటనలో భారత్ జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని తెలియజేద్దాం. అయితే మరో జట్టు ఇంగ్లాండ్‌లో ఉంటుంది. ఐర్లాండ్‌తో జరిగే 2 టీ20మ్యాచ్‌లకు ప్రకటించిన 17 మందిలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రీతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?