Samantha: ఇన్‌స్టా పోస్టులతో కోట్లు వెనకేస్తోన్న సమంత.. ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

గత కొన్నేళ్లుగా సమంత పాపులారిటీ బాగా పెరిగింది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తనదైన ముద్ర వేసింది ఈ నటి. మరోవైపు, సమంత ప్రతిరోజూ తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూనే ఉంటుంది.

Samantha: ఇన్‌స్టా పోస్టులతో కోట్లు వెనకేస్తోన్న సమంత.. ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Samantha
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:12 PM

Samantha Social Media Earnings: సౌత్ సినిమా టాప్ హీరోయిన్లలో సమంత రూత్ ప్రభు ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు అవసరం లేని నటిగా మారిపోయింది. ఇక ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ ప్రశంసలు దక్కించుకుంది. అలానే తన అభిమాలను సంఖ్యను కూడా మరింత పెంచుకుంది. ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లను పక్కన పెడితే, సోషల్ మీడియాలోనూ తన సత్తా చాటుతూ ఫ్యాన్స్‌కు విందు చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో నెట్టింటిని కూడా తన ఆదాయంలో భాగంగా చేసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే సమంత.. సోషల్ మీడియాలో ప్రమోషన్స్‌లో భాగంగా భారీగా సంపాదిస్తోంది. తాజాగా తన బికినీ ఫోటోను నెట్టింట్లో షేర్ చేసింది. అది చాలా వైరల్ అయ్యింది. ఈ బికినీ బ్రాండ్ ప్రమోషన్ కోసం సమంత దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ పోస్ట్‌ల ప్రమోషన్‌ కోసం సుమారు రూ. 2 నుంచి రూ. 3 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు 23.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

గత కొన్నేళ్లుగా సమంత పాపులారిటీ బాగా పెరిగింది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తనదైన ముద్ర వేసింది ఈ నటి. మరోవైపు, సమంత ప్రతిరోజూ తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూనే ఉంటుంది. ఇందులో ఆమె ఎక్కువగా పలు రకాల బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ కనిపిస్తుంది. దీంతో ఇన్‌స్టానే తన మేజర్ ఆదాయ వనరుగా మార్చుకుని, భారీగా వెనకేసుకుంటోంది. అలానే ఇన్‌స్టాలో టీమిండియా క్రికెటర్ విరాట్‌ కోహ్లీ ఒక్కో పోస్ట్‌ నుంచి రూ. 50 కోట్లు తీసుకుంటాడని తెలుస్తోంది. బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా రూ.3 కోట్లు, షారుఖ్‌, ఆలియా భట్‌, కత్రినా కోటి రూపాయలు తీసుకుంటారనే టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

హార్రర్ సినిమాలో కనిపించనున్న సమంత..

ఈ సౌత్ బ్యూటీ త్వరలో ఓ హర్రర్ సినిమాలో యశోద పాత్రలో కనిపించనుంది. సమంత చేతిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. అయితే ఈ నటి డిజిటల్‌గా చాలా ప్రాజెక్ట్‌లు చేయబోతోంది. దీంతో పాటు సమంత చేతిలో ఓ హాలీవుడ్ చిత్రం కూడా ఉంది. ఈ సినిమాతోనే నటి ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయబోతోంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసమే సమంత నెలలో రెండు మూడు పోస్ట్‌లు చేస్తుంది. రీసెంట్‌గా సమంత బుర్బెర్రీ అనే బ్యాగ్‌ని కూడా ప్రమోట్ చేసింది. సమంతకు ఉన్న పాపులారిటీ ఆమె సినిమాలు చేయకుండానే, భారీగా సంపాదిస్తోంది.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు