Lokesh Kanagaraj: ‘మాస్టర్’ వర్సెస్ ‘మారి’.. మరో భారీ మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధం చేసిన విక్రమ్ డైరెక్టర్..

డైరెక్టర్ లోకేష్‌ సినిమాల విషయానికి వస్తే తన సినిమాల్లో హీరోలు ఇద్దరు ఉంటారనే టాక్ నిజమవుతూనే ఉంది. విజయ్ హీరోగా నటించిన మాస్టర్‌ సినిమాలో.. విజయ్‌సేతుపతి యాంటీ రోల్ పోషించాడు. ఇక తాజాగా వచ్చిన కమల్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలో..

Lokesh Kanagaraj: 'మాస్టర్' వర్సెస్ 'మారి'.. మరో భారీ మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధం చేసిన విక్రమ్ డైరెక్టర్..
Lokesh Kanagaraj
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:12 PM

మూవీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతోపాటు, మల్టీస్టారర్ సినిమాల సందడి కనిపిస్తోంది. ఏ భాషలో చూసినా వీటి హమానే కొనసాగుతోంది. ఈ క్రమంలో రాంచరణ్, ఎన్టీఆర్ జోడీగా నటించిన టాలీవుడ్ సినిమా ఆర్‌ఆర్‌ఆర్, అలాగే కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి నటించిన కోలీవుడ్ మూవీ విక్రమ్.. భారీగా వసూళ్లను రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకులతోపాటు హీరోల ఛాయస్ కూడా మారిపోయింది. ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌(Lokesh Kanagaraj) ప్రస్తుతం విక్రమ్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం నెట్టింట్లో ఓ వార్త తెగ సందడి చేస్తోంది. తన తదుపరి సినిమాలోనూ మల్టీస్టారర్‌గానే తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో విజయ్(Vijay) లీడ్‌ రోల్ పోషిస్తున్నాడని, ఆయనకు పోటీగా మరో హీరోను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ లోకేష్‌ సినిమాల విషయానికి వస్తే తన సినిమాల్లో హీరోలు ఇద్దరు ఉంటారనే టాక్ నిజమవుతూనే ఉంది. విజయ్ హీరోగా నటించిన మాస్టర్‌ సినిమాలో.. విజయ్‌సేతుపతి యాంటీ రోల్ పోషించాడు. ఇక తాజాగా వచ్చిన కమల్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలో మరోసారి విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. అయితే, సూర్య కూడా స్సెషల్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు.

ఈ డైరెక్టర్ తన తదుపని సినిమా విజయ్‌తో తీయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో స్టార్‌ హీరో ధనుష్‌(Dhanush)ని ప్రతినాయకుడి పాత్రలో చూపించేందుకు ఈ యువ డైరెక్టర్ సిద్ధమయ్యాడంట. ఈ క్రమంలో హీరో ధనుష్‌కు స్టోరీ వినిపించగా, ఆయనకు విలన్ పాత్ర బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందని సమాచారం. అయితే, ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి