AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 5 CNG Cars: రూ.75ల్లో 35 కిలోమీటర్ల మైలేజ్.. భారతదేశంలో టాప్-5 సీఎన్‌జీ కార్లు ఇవే..

ఇంధన బడ్జెట్‌ను తగ్గించగల భారతదేశపు టాప్-5 CNG కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో కొన్ని కేవలం రూ.75లో 35 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయి.

Top 5 CNG Cars: రూ.75ల్లో 35 కిలోమీటర్ల మైలేజ్.. భారతదేశంలో టాప్-5 సీఎన్‌జీ కార్లు ఇవే..
India's Top 5 Cng Cars
Venkata Chari
|

Updated on: Jun 14, 2022 | 6:06 PM

Share

పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుల వెన్ను విరుస్తున్నాయి. కానీ, సీఎన్‌జీ ధరలు స్వల్పంగా పెరిగినా సామాన్యులకు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఇంధన బడ్జెట్‌ను తగ్గించగల భారతదేశపు టాప్-5 CNG కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో కొన్ని కేవలం రూ.75లో 35 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయి.

  1. మారుతి సెలెరియో సీఎన్‌జీ(Maruti Celerio CNG): CNG కార్లలో మారుతీ సుజుకి ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ మారుతి సెలెరియో. సెలెరియో దేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారు. అలాగే సీఎన్‌జీలోనూ ఇది టాప్ ప్లేస్‌లోనే ఉంది. ఇది 1 కిలో సీఎన్‌జీలో 35.60 కిమీ మైలేజీని ఇస్తుంది. ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.75.61గా ఉంది. ఈ విధంగా, ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్‌తో మారుతి సెలెరియో 75 రూపాయలతో 35 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.6.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
  2. మారుతి వ్యాగనార్ సీఎన్‌జీ (WagonR CNG): మారుతి కంపెనీకి చెందిన మరో హ్యాచ్‌బ్యాక్ మారుతి వ్యాగనార్ సీఎన్‌జీ మైలేజీలోనూ తగ్గేదేలే అంటోంది. ఇది 1 కిలో సీఎన్‌జీతో 34.05 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.6.42 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
  3. మారుతి ఆల్టో సీఎన్‌జీ (Maruti Alto CNG): దేశంలోనే అత్యంత చవకైన కారుగా మారుతి ఆల్టో CNG నిలిచింది. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.03 లక్షలు. అదే సమయంలో, ఇది ఒక కిలో సీఎన్‌జీలో 31.59 కిమీల మైలేజీని అందిస్తుంది. ఇది 800సీసీ ఇంజన్‌తో వస్తుంది.
  4. మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ (Maruti S-Presso CNG): మారుతి నుంచి వచ్చిన మరో కారు, మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ. మైలేజీలోనూ ఇది ఎంతో గొప్పగా ఆకట్టుకుంటోంది. ఇది కిలోగ్రాము గ్యాస్‌తో 31.2 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.5.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. టాటా టియాగో సీఎన్‌జీ (Tata Tiago CNG): టాటా మోటార్స్ తన CNG కార్లను ఈ సంవత్సరం నుంచే భారత మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ క్రమంలో వీటిలో కంపెనీకి చెందిన టాటా టియాగో సీఎన్‌జీ కారు మైలేజీతో వాహనదారులను ఆకట్టుకుంటుంది. ఇది ఒక కిలో గ్యాస్‌లో 26 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.6.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.