Chanakya Niti: జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..
Chanakya Niti in Telugu: ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో జీవితంలోని ముఖ్యమైన దశ గురించి కీలక సమాచారాన్ని అందించారు. స్త్రీ అయినా, పురుషుడైనా తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో విఫలమైతే జీవితమంతా..
ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతి జీవిత సూత్రాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ఇందులో జీవితం సంతోషంతోపాటు, విజయవంతం కావడానికి అనేక ఉపయోగకరమైన చిట్కాలు, సూచనలను ఆయన అందించారు. జీవితంలోని ప్రతి అంశంలో మానవులకు పలు సూచనలను అందించడమే ఈ నీతిశాస్త్రం ప్రధాన అంశంగా నిలిచింది. మనిషి జీవితంలో వివాహం కూడా ఒక ముఖ్యమైన దశ. మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా కష్టం. స్త్రీ అయినా, పురుషుడైనా తన జీవిత భాగస్వామి లోపాలను కలిగి ఉంటే ఆమె జీవితమంతా నరకమే అవుతుందని అంటారు ఆచార్య. అందువల్ల, జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఒత్తిడిలో ఎప్పుడూ పెళ్లి చేసుకోవద్దు..
ఏ వ్యక్తి అయినా ఒత్తిడితో పెళ్లి చేసుకోకూడదు. అలాంటి జీవితం మీకు భవిష్యత్తులో ప్రేమను లేదా జీవితంలో ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు. వివాహ సమయంలో కుటుంబంతోపాటు ఆచార వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఆచార్య చాణక్యుడు సూచించారు. వైవాహిక జీవితానికి ఈ పద్ధతులను కొనసాగించడం చాలా అవసరం.
అందం కాదు.. జీవిత భాగస్వామి లక్షణాలను చూడాలి..
ఆచార్య చాణక్యుడు ప్రకారం అందాన్ని చూసి పెళ్లి చేసుకోకూడదు. ఎవరైతే కేవలం ముఖ సౌందర్యాన్ని చూసి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారో.. వారి జీవితం భవిష్యత్తులో నరకంగా మారవచ్చు. జీవిత భాగస్వామి లక్షణాలు, విలువలు, విద్యను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులే జీవితాన్ని స్వర్గంగా మార్చుకుంటారు.
జీవిత భాగస్వామిలో సహనం కీలకం..
జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిలో ఎంత ఓపిక ఉందో కచ్చితంగా చూడాలి అంటున్నారు ఆచార్య చాణక్య. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఓపిక అవసరం. అలాగే మధురంగామాట్లాడే వ్యక్తి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారంట.