Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. నేడు ఈ రాశి వ్యాపారస్తులు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు..

ఈరోజు (జూన్ 14వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఏ రాశివారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. నేడు ఈ రాశి వ్యాపారస్తులు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Jun 14, 2022 | 6:46 AM

Horoscope Today (14-06-2022): వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలో ఉన్నవారైనాసరే.. రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. తమ జాతకంపై రాశుల ప్రభావం ఎలా ఉందొ తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 14వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఏ రాశివారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. స్నేహితులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరి సహకారంతో ముందుకు వెళ్లారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారు శుభ ఫలితాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది.  నూతన వస్తువు, నగలు కొనుగోలు చేస్తారు. సంతోషకరమైన వార్తను వింటారు. చేపట్టిన ప్రయత్నాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.    శుభవార్త వింటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కల్గుతుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. ఇతరుల సహాయసహకారాలతో సాయం అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక విషయాల్లో కుటుంబ సభ్యులతో అభిప్రాయబేధాలు రానీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయం కలుగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అవసరానికి తగిన సాయం చేస్తారు. శత్రువుల విషయంలో తగిన జాగ్రత్తగలు తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా ధృడంగా తగిన నిర్ణయాలను తీసుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అతిగా ఎవరినీ నమ్మి పనులు చేపట్టవద్దు. చేపట్టిన పనులను చిత్త శుద్ధితో పూర్తి చేస్తారు.  మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి.. ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలోని వారికి అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది.   బంధు, మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు దైవ బలంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఉంటాయి.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. అధికారులతో కొన్ని ముఖ్య విషయాల్లో అభిప్రాయబేధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)