Nayanthara: కోలీవుడ్‌కు షాకిచ్చిన లేడీ సూపర్‌స్టార్.. డైరెక్టర్లకు ‘ఆ విషయం’లో కొత్త కండీషన్స్..

నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొత్త సినిమాలు ఒప్పుకుంది. కాగా, ఇప్పటికే సైన్ చేసిన సినిమాలకు ఈ రూల్స్ వర్తించవని, ఇకపై నటించే సినిమాల్లో మాత్రం ఈ రూల్స్ తప్పక అప్లై చేయనున్నట్లు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nayanthara: కోలీవుడ్‌కు షాకిచ్చిన లేడీ సూపర్‌స్టార్.. డైరెక్టర్లకు 'ఆ విషయం'లో కొత్త కండీషన్స్..
Nayanathara
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:12 PM

లేడీ సూపర్‌స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఇటీవలే ఏడడులు వేసిన సంగతి తెలిసిందే. కాగా, వివాహం తర్వాత కోలీవుడ్‌కు నయన్, భారీ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తను నటించబోయే సినిమాలకు సరికొత్త కండీషన్స్ అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కథలను వినిపించే, దర్శకనిర్మాతలు ఎక్స్‌ఫోజింగ్ పాత్రలు కాకుండా, కేవలం మహిళల నేపథ్యంలో సాగే సినిమాలతోనే రావాలని రూల్స్ పెట్టిందంట.

నయనతార ఇప్పటికే ఎక్స్‌ఫోజింగ్ చేసే పాత్రలకు దూరంగా ఉంటోంది. స్టార్‌ యాక్టర్స్‌తో నటించినా.. ఎక్స్‌ఫోజింగ్ విషయంలో ఏమాత్రం నిర్మోహమాటంగానే కుదరదు అంటోందని తెలుస్తోంది. తన పాత్రకు కొన్ని రూల్స్ పెట్టుకుందని, ఆ పరిధిలోనే సినిమాలు చేస్తుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వివాహం చేసుకున్న ఈ లేడీ సూపర్‌స్టార్.. సినిమాలకు మాత్రం దూరంకానని చెప్పుకొచ్చింది. అయితే, తన పాత్ర విషయంలోనూ, గ్లామర్ ప్రదర్శించే విషయంలో మాత్రం కొత్త రూల్స్ పెట్టిందంట.

కాగా, నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొత్త సినిమాలు ఒప్పుకుంది. కాగా, ఇప్పటికే సైన్ చేసిన సినిమాలకు ఈ రూల్స్ వర్తించవని, ఇకపై నటించే సినిమాల్లో మాత్రం ఈ రూల్స్ తప్పక అప్లై చేయనున్నట్లు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమాలో నయన్ నటిస్తోంది. అలాగే చిరంజీవితో కలసి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి