AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వారెవ్వా.. వార్నర్‌తో అట్లుంటది మరి.. సింగిల్ హ్యాండెడ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు..

మ్యాచ్‌లో వార్నర్ అద్భుతమైన క్యాచ్ పట్టి, ఫీల్డింగ్‌లో రాణించాడు. కానీ, అతని బ్యాట్ మాత్రం ఈ మ్యాచ్‌లో సత్తా చాటలేదు. వార్నర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

Watch Video: వారెవ్వా.. వార్నర్‌తో అట్లుంటది మరి.. సింగిల్ హ్యాండెడ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు..
David Warner
Venkata Chari
|

Updated on: Jun 15, 2022 | 4:55 PM

Share

SL vs AUS: శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం జరిగిన తొలి వన్డేలో 35 ఏళ్ల డేవిడ్ వార్నర్.. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌కు భారీ షాక్ ఇచ్చాడు. ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ పట్టి, ఔరా అనిపించాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. వార్నర్ పట్టిన ఈ అద్బుత క్యాచ్ చూసిన బౌలర్ ఆష్టన్ అగర్ కూడా ఆశ్చర్యపోయి తల పట్టుకున్నాడు. అలాగే ఈ క్యాచ్ చూసి బ్యాటింగ్ చేస్తున్న ధనంజయ్ డిసిల్వా కూడా షాక్‌లో కొద్దిసేపు క్రీజులో అలానే ఉండిపోయాడు. ధనంజయ్ మిడ్-ఆన్ మీదుగా భారీ షాట్ ఆడాలనుకున్నాడు. ఈ క్రమంలో బంతిని బౌండరీ వెలుపల పంపేందుకు ట్రై చేశాడు. కానీ, సరిగ్గా టైం చేయలేకపోవడంతో, మిడ్-ఆన్ వద్ద నిలబడి ఉన్న డేవిడ్ వార్నర్.. దాదాపు అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకుని, ఔరా అనిపించాడు. ఈ క్యాచ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మ్యాచ్‌లో వార్నర్ అద్భుతమైన క్యాచ్ పట్టి, ఫీల్డింగ్‌లో రాణించాడు. కానీ, అతని బ్యాట్ మాత్రం ఈ మ్యాచ్‌లో సత్తా చాటలేదు. వార్నర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతడిని మహేష్ దీక్షా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆస్ట్రేలియా ముందు 300 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇవి కూడా చదవండి

వర్షం ప్రభావితం చేసిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు డక్‌వర్త్-లూయిస్ నియమం ప్రకారం 44 ఓవర్లలో 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిని ఆస్ట్రేలియా 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

శ్రీలంక జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. 49వ ఓవర్‌లో ఝీ రిచర్డ్‌సన్ వేసిన మొదటి 5 బంతుల్లో వనిందు హసరంగ 5 ఫోర్లు కొట్టి మొత్తం 22 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఓవర్‌లోనూ హేజిల్‌వుడ్‌ బౌండరీ బాదేశాడు. అనంతరం ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. హసరంగా 19 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌