IPL: ఇకపై ఐపీఎల్ రెండున్నర నెలలు.. విదేశాల్లోనూ మ్యాచ్‌లు: బీసీసీఐ సెక్రటరీ జైషా

ఐపీఎల్ 15వ సీజన్ నుంచి జట్ల సంఖ్యను 8 నుంచి 10కి పెంచారు. గుజరాత్ టైటాన్స్, లక్నో జెయింట్స్ తొలిసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాయి. దీంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది. 2 నెలల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. అదే సమయంలో..

IPL: ఇకపై ఐపీఎల్ రెండున్నర నెలలు.. విదేశాల్లోనూ మ్యాచ్‌లు: బీసీసీఐ సెక్రటరీ జైషా
Ipl 2022 Final Match Bcci Secretary Jay Shah
Follow us
Venkata Chari

|

Updated on: Jun 15, 2022 | 6:46 PM

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఐపీఎల్‌ కోసం రెండున్నర నెలల సమయం ఇవ్వనుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్.. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది. ఇటీవలే జరిగిన ఐపీఎల్ మీడియా రైట్స్ విషయంలోనూ తన సత్తా చాటి, అత్యధికంగా ఆర్జించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీ జైషా పీటీఐతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఐపీఎల్‌ జట్లు విదేశాలకు వెళ్లి స్నేహపూర్వక మ్యాచ్‌లు కూడా ఆడేందుకు బీసీసీఐ, ఫ్రాంచైజీలు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని చెప్పుకొచ్చాడు.

నిజానికి ఐపీఎల్ 15వ సీజన్ నుంచి జట్ల సంఖ్యను 8 నుంచి 10కి పెంచారు. గుజరాత్ టైటాన్స్, లక్నో జెయింట్స్ తొలిసారి ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాయి. దీంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది. 2 నెలల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. అదే సమయంలో, ఈసారి అనేక అంతర్జాతీయ జట్ల మధ్య సిరీస్‌ల కారణంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత చాలా మంది ఆటగాళ్లు తమ తమ టీమ్‌లలో చేరారు. అదే సమయంలో, చాలా మంది ఆటగాళ్ళు జాతీయ జట్లకు ఆడటానికి IPLకు దూరం అయ్యారు.

ఈమేరకు BCCI ఐపీఎల్ కోసం రెండున్నర నెలల సమయాన్ని ఇవ్వాలని ఐసీసీని కోరనుందని తెలుస్తోంది. తద్వారా విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో పాల్గొనవచ్చు. ఐపీఎల్‌కు రెండున్నర నెలల సమయం కేటాయించాలని ఐసీసీ, వివిధ దేశాల బోర్డులతో బీసీసీఐ చర్చించిందని జైషా తెలిపారు.

ఇవి కూడా చదవండి

స్నేహపూర్వక మ్యాచ్‌ల కోసం విదేశీ బోర్డులతో చర్చలు..

ఐపీఎల్ జట్లు దేశం వెలుపలికి వెళ్లి విదేశీ జట్లతో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జైషా తెలిపారు. విదేశీ బృందాలు కూడా దీని గురించి చర్చిస్తున్నాయి. అయితే ఇది సుదీర్ఘ ప్రక్రియ అని, ఇందుకోసం ఆ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌గా ఐపీఎల్ అవతరించిందని, ఐపీఎల్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లీగ్ అని జైషా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కు ఆదరణ పెరిగిందని, కరోనా కాలంలో మళ్లీ క్రికెట్ వాతావరణాన్ని నెలకొల్పడంలో IPL కీలక పాత్ర పోషించిందని, 2017లో డిజిటల్ స్ట్రీమింగ్‌ను వీక్షించే వారి సంఖ్య 560 మిలియన్లు కాగా, 2022లో కేవలం 5 సంవత్సరాల తర్వాత, ఈ సంఖ్య 665 మిలియన్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఐపీఎల్ మీడియా హక్కులతో రూ. 48,390 కోట్లు..

ఐపీఎల్ మీడియా హక్కులను రూ.48,390 కోట్లకు విక్రయించడంలో ఆశ్చర్యం లేదని జైషా అన్నారు. ఐపీఎల్‌కు ఆదరణ పెరిగిన తీరు చూస్తే ఇంత మొత్తం వస్తుందని భావించారు. IPL (2023 నుంచి 2027 వరకు) తదుపరి ఐదు సీజన్ల మీడియా హక్కుల వేలం ద్వారా BCCI రూ. 48,390.52 కోట్లు పొందింది. భారత ఖండం టీవీ హక్కులను డిస్నీ స్టార్ రూ.23,575 కోట్లకు కొనుగోలు చేసింది. Viacom18 భారత ఖండంలోని డిజిటల్ హక్కులను రూ. 20,500 కోట్లకు, అలాగే ఎంపిక చేసిన 98 మ్యాచ్‌ల నాన్-ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ హక్కులను రూ. 3,258 కోట్లకు కొనుగోలు చేసింది.

భారత ఉపఖండం వెలుపల హక్కులను వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.1057 కోట్ల బిడ్ దాఖలైంది. ఈ విధంగా, BCCI మొత్తం నాలుగు ప్యాకేజీలతో కలిపి రూ. 48,390.52 కోట్లు పొందింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!