AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెమీఫైనల్‌లో సెంచరీ.. ఆ తర్వాత వారికి ‘ఐ లవ్ యూ’.. నెట్టింట్లో సందడి చేస్తోన్న క్రీడాశాఖ మంత్రి.. ఎవరంటే?

మధ్యప్రదేశ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో మనోజ్ తివారీ తన సెంచరీని పూర్తి చేయగానే, అతను ఆ కాగితాన్ని గాలిలో ఊపుతూ తన ప్రేమను చాటుకున్నాడు.

సెమీఫైనల్‌లో సెంచరీ.. ఆ తర్వాత వారికి 'ఐ లవ్ యూ'.. నెట్టింట్లో సందడి చేస్తోన్న క్రీడాశాఖ మంత్రి.. ఎవరంటే?
Manoj Tiwary
Venkata Chari
|

Updated on: Jun 16, 2022 | 3:41 PM

Share

రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌లో బెంగాల్ జట్టు కష్టాల్లో పడిన వేళ.. ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి చొరవ తీసుకున్నారు. మనోజ్ తివారీ బెంగాల్ జట్టు తరపున నాకౌట్ మ్యాచ్‌ల్లో అదరగొడుతున్నాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో సెంచరీ బాదిన అతను ఇప్పుడు సెమీ ఫైనల్‌లోనూ సెంచరీ బాదేశాడు. కానీ, ఈసారి సెంచరీ చేసిన తర్వాత అతను చేసిన ఓ పని నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. రంజీ ట్రోఫీ సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో మనోజ్ తివారీ 211 బంతులు ఎదుర్కొని 102 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 205 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. అతను చేసిన పనితో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 29వ సెంచరీ చేసిన తర్వాత, మనోజ్ తివారీ తన కుటుంబ సభ్యులందరికీ ఐ లవ్ యూ అని ప్రత్యేకంగా రాసిన ఓ కాగితాన్ని ప్రదర్శించాడు. వారు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. మనోజ్ తివారీ ఒక కాగితంపై గుండె చిత్రాన్ని గీసి దానిపై తన భార్య, పిల్లల పేర్లు రాశాడు.

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో మనోజ్ తివారీ తన సెంచరీని పూర్తి చేయగానే, అతను ఆ కాగితాన్ని గాలిలో ఊపుతూ భార్య, పిల్లలపై తన ప్రేమను చాటుకున్నాడు. మనోజ్ తివారీ భార్య సుస్మితా రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇద్దరు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు. దాదాపు 7 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

మనోజ్ తివారీ నాకౌట్ దశలో బెంగాల్ తరపున ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు. క్వార్టర్‌ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు, సెమీ-ఫైనల్స్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడానికి ముందు రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేశాడు.

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..