Sippy Sidhu: నేషనల్‌ లెవెల్‌ షూటర్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీబీఐ అదుపులో హైకోర్టు జడ్జి కూతురు..

Sippy Sidhu Murder Case: సుమారు ఏడేళ్ల క్రితం జరిగిన సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ (35) అలియాస్ సిప్పీ సిద్ధూ (Sippy Sidhu) హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది

Sippy Sidhu: నేషనల్‌ లెవెల్‌ షూటర్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీబీఐ అదుపులో హైకోర్టు జడ్జి కూతురు..
Sippy Sidhu Murder Case
Basha Shek

|

Jun 16, 2022 | 7:44 AM

Sippy Sidhu Murder Case: సుమారు ఏడేళ్ల క్రితం జరిగిన సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ (35) అలియాస్ సిప్పీ సిద్ధూ (Sippy Sidhu) హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నేషనల్‌ లెవెల్‌ షూటర్‌ అయిన అతను 2015 సెప్టెంబర్ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. చండీగఢ్‌లోని ఓ పార్కులో అతనిని దారుణంగా కాల్చి చంపారు. సిద్ధూ జాతీయ షూటర్, పైగా ఓ కార్పొరేట్‌ లాయర్‌. పంజాబ్‌ – హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఎస్‌ సిద్ధూ మనవడు. ఈక్రమంలో హైప్రొఫైల్ కుటుంబానికి చెందినవాడు కావడంతో.. సిప్పీ సిద్ధూ హత్య అప్పట్లో పెను సంచలనమైంది. అయితే ఈ హత్యకు కారకులెవరో, ఎందుకు అతన్ని హత్య చేశారో సరైన సాక్ష్యాధారాలు దొరక్కపోవడం వల్ల ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఏడేళ్ల వరకూ విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ హత్య చేయించింది సిద్ధూ ప్రియురాలు కళ్యాణినే అని అనుమానిస్తోన్న సీబీఐ, ఆమెని అదుపులోకి తీసుకుంది. అన్నట్లు ఈమె ఎవరో తెలుసా? హిమాచల్ ప్రదేశ్ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కూతురు. కళ్యాణి ఒక కాలేజీ ప్రొఫెసర్ కూడా.

ఆధారాలు లేకపోవడంతో..

కాగా 2016లోనే ఈ హత్యలో ఒక మహిళ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు సరైన ఆధారాలు దొరక్కపోవడంతో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎంతసేపటికీ ఈ కేసు ముందుకు సాగకపోవడంతో.. 2016లో పంజాబ్‌ గవర్నర్‌ జోక్యంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో క్లూ అందిస్తే, వాళ్లకు రూ. 5 లక్షల నజరానా ఇస్తామని అప్పట్లో సీబీఐ సంచలన ప్రకటన చేసింది. కేసుని విచారిస్తున్న సమయంలో, సిద్ధూ హత్య జరిగిన సమయంలో అతనితో ఓ యువతి ఉందన్న విషయాన్ని సీబీఐ నిగ్గు తేల్చింది. దీంతో.. ఆమె ఎవరో ముందుకొస్తే నిరపరాధిగా పేర్కొంటామని, లేదంటే హత్యలో ఆమెకూ భాగం ఉంటుందని తేల్చాల్సి ఉంటుందని సీబీఐ హెచ్చరించింది. ఆ తర్వాత 2021లో నజరానాను రూ.10 లక్షలకు పెంచినా, ఫలితం లేకుండా పోయింది.

రిలేషన్‌షిప్‌ బెడిసి కొట్టడంతో..

అయితే ఈ నేపథ్యంలోనే ఈ హత్య సిద్ధూ ప్రేయని కళ్యాణి చేయించిందని, ఆమెను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కళ్యాణి సింగ్‌ను ప్రశ్నించారు. అనంతరం ఆమె హస్తం ఉందన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా కళ్యాణిని కూలంకశంగా ప్రశ్నించాకే అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారు ఒకరు స్పష్టం చేశారు. రిలేషన్‌షిప్‌ బెడిసి కొట్టడంతోనే ఆమె సిప్పీని హత్య చేయించిందని తెలుస్తోంది. బుధవారం చండీగఢ్‌లోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి, నాలుగు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ విధించినట్లు సీబీఐ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu