AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tragedy: తాగొచ్చిన నాన్న కొడతాడని పెరట్లో దాక్కున్న చిన్నారి.. కాటేసిన విష సర్పం.. పాపం

ఈ మంగళవారం రాత్రి కూడా అతను తాగొచ్చాడు. భార్యను కొడుతుండగా.. పిల్లలు భయంతో పరుగులు తీశారు. పెరట్లోని చెట్ల పొదల్లో దాకున్నారు. ఆపై...

Tragedy: తాగొచ్చిన నాన్న కొడతాడని పెరట్లో దాక్కున్న చిన్నారి..  కాటేసిన విష సర్పం.. పాపం
Snakebite
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2022 | 8:39 AM

Share

విధి మనుషుల జీవితాలతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. దేవుడు రాసిన స్క్రిప్ట్‌లో ఏ పాత్ర ఎప్పుడు ముగుస్తుందో అస్సలు ఊహించలేం. తాజాగా  తమిళనాడు(Tamil Nadu) కన్యాకుమారి(Kanyakumari) కుత్తైకాడు పలవిలైలో హృదయ విదారక ఘటన జరిగింది. రోజూ మద్యం తాగి.. ఇంట్లో గొడవ చేసే నాన్న కోప్పడతాడేమో, కొడతాడేమో అన్న భయంతో ఓ చిన్నారి ఇంటి పెరట్లో దాక్కోగా.. పాము ఆమెను కాటేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ బాలిక కన్నుమూసింది. దీంతో ఆ చిన్నారి తల్లి గుండెలవిసేలా రోదిస్తుంది. విషయం తెలిసి గ్రామస్థులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. మంగళవారం రాత్రి ఈ విషాద ఘటన  జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పలవిలై గ్రామంలో సురెందిన్ అనే వ్యక్తి డైలీ లేబర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య సిజిమోల్.. ముగ్గురు పిల్లలు సుశ్విన్​ సిజో(12), సుజిలిన్​ జో(9), సుశ్విక మోల్​(4) ఉన్నారు. సురెందిన్ లిక్కర్‌కు అడిక్ట్ అయ్యాడు.  డైలీ మద్యం సేవించకుండా ఇంటికి వచ్చేవాడు కాదు. పీకలదాకా మద్యం తాగి వచ్చి భార్య, పిల్లలను కొడతాడు. ఈ మంగళవారం రాత్రి కూడా ఇలాగే తాగొచ్చాడు. భార్యను కొడుతుండగా.. పిల్లలు భయంతో పరుగులు తీశారు. పెరట్లోని చెట్ల పొదల్లో దాకున్నారు. ఆపై అక్కడే నిద్రపోయారు. అయితే ఓ పాము.. సుశ్విక నిద్రలో ఉండగా కాటేసింది. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి తుదిశ్వాస విడిచింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం
రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి..ఆరోగ్య ప్రయోజనం