Viral Video: క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌ నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ వావ్ అంటారు..

క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఆశ్చర్యం అనిపిస్తే..మరికొన్ని ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల క్యాచ్‌ల విషయంలో ఆటగాళ్లు చిత్ర విచిత్రమైన ఫీట్లు చేస్తున్నారు.

Viral Video: క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌ నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ వావ్ అంటారు..
Cricket
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2022 | 9:11 AM

క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఆశ్చర్యం అనిపిస్తే..మరికొన్ని ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల క్యాచ్‌ల విషయంలో ఆటగాళ్లు చిత్ర విచిత్రమైన ఫీట్లు చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో మరొకటి ట్రెండింగ్లో ఉంది. విలేజ్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ జరిగింది. ఇంగ్లాండ్‌లోని అల్‌డ్విక్‌ క్రికెట్‌ క్లబ్‌, లింగ్‌ఫీల్డ్ క్రికెట్‌ క్లబ్‌ జట్ల మధ్య గురువారం ఓ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా అల్‌డ్విక్‌ జట్టుకు చెందిన అలెక్స్‌ రైడర్‌ అనే 16 ఏళ్ల యువ బౌలర్‌ విసిరిన ఓ బంతిని బ్యాటర్‌ గాల్లోకి ఆడాడు. ఆ బంతి బౌలర్‌ దగ్గరకే రావడంతో దాన్ని క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో అతడు వెనక్కి పడిపోవడంతో క్యాచ్‌ చేజారి బంతి కిందపడేలా కనిపించింది. అయితే, అప్పుడు ఆ బంతి బౌలర్‌ కుడి కాలుకు తాకి మళ్లీ గాల్లోకి లేచింది. దీంతో రెండోసారి వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకొన్నాడు. అద్భుతంగా బంతిని ఒడిసిపట్టాడు.

బంతిని భలే పట్టేశాడు..

ఇవి కూడా చదవండి

ఇలా ఎవరూ ఊహించని విధంగా ప్రత్యర్థి బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపించాడు అలెక్స్‌. ఈ క్యాచ్‌ను చూసిన తోటి ఫీల్డర్లు సైతం అలెక్స్‌ అద్భుతాన్ని నమ్మలేకపోయారు. ఔటైన బ్యాటర్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిరాశగా క్రీజును వీడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్.. ‘ఇలాంటి క్యాచ్‌ నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌’, ‘బంతిని భలే పట్టేశాడు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు