ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు డకౌట్.. నెల తిరగకుండానే రెండోసారి చెత్త రికార్డు నమోదు చేసిన జట్టు ఏదంటే..

WI vs BAN: ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆంటిగ్వాలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 32.5 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది.

ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు డకౌట్.. నెల తిరగకుండానే రెండోసారి చెత్త రికార్డు నమోదు చేసిన జట్టు ఏదంటే..
Test Cricket
Follow us

|

Updated on: Jun 17, 2022 | 9:29 AM

WI vs BAN: ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆంటిగ్వాలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 32.5 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. కరీబియన్ బౌలర్ల ముందు బంగ్లా పులులు బెంబేలెత్తిపోయారు. ఆ జట్టులోని ఏకంగా ఆరుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకోవడం గమనార్హం. కెప్టెన్‌ షకీబ్ అల్ హసన్ మాత్రమే 51 పరుగులు చేసి తన జట్టుకు కాస్తోకూస్తో గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బంగ్లాలో డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్లలో ముగ్గురు టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఉండడం గమనార్హం. మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ శాంటో, మోమినుల్ హక్ వంటి అగ్రశేణి ఆటగాళ్లతో పాటు నరుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీద్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. వెస్టిండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, జైడెన్ తలా 3 వికెట్లు తీయగా.. కీమర్ రోచ్, కైల్ మైయర్స్ రెండు వికెట్లు తీశారు.

నెల తిరగకుండానే.. కాగా ఈ ఏడాది మే 23 నుంచి శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ ఇలాంటి చెత్త రికార్డునే నమోదు చేసింది. మిర్పూర్‌ వేదికగా జరిగిన ఆ టెస్ట్‌లోనూ ఆరుగురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. నెల తిరగకుండానే మరోసారి ఇలాంటి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది బంగ్లాదేశ్‌. తద్వారా టెస్ట్‌ క్రికెట్‌లో ఈ చెత్త రికార్డును నమోదు చేసిన మొదటి జట్టుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..