T20 Cricket: ఐదుగురు బ్యాటర్స్ జీరో.. 35 పరుగులకే ఆలౌట్.. జట్టు స్కోర్‌లో ఎక్స్‌ట్రాలే ఎక్కువ..
క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా 35 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు.. ఇంతవరకు విజయాన్ని సాధించలేదు. ప్రస్తుత మ్యాచ్‌లోనూ మరోసారి ఇదే నిరూపితమైంది.
గత ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటైంది. అయితే అది టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్. కానీ, ప్రస్తుతం మాట్లాడుతున్న టీ20 మ్యాచ్‌లో ఓ జట్టు కేవలం 35 పరుగులకే ఆలౌట్ అయింది. క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా 35 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు విజయాన్ని ఎవరూ ఊహించలేరు. 35 పరుగుల వద్ద కుప్పకూలిన తర్వాత, ఈ జట్టు కూడా గెలవలేదు. మొత్తంగా 75 బంతులు, 9 వికెట్ల భారీ తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. బోట్స్వానా వర్సెస్ ఉగాండా (Botswana Women vs Uganda Women) మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మ్యాచ్‌లో ఉగాండాపై బోట్స్వానా జట్టు కేవలం 35 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో బోట్స్వానా తొలుత బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 18.5 ఓవర్లలో జట్టు మొత్తం 35 పరుగులకే పరిమితమైంది. అనంతరం 36 పరుగుల లక్ష్యాన్ని ఉగాండా జట్టు 8 ఓవర్లు పూర్తి కాకముందే ఛేదించింది.
బోట్స్వానా 35 పరుగులకే ఆలౌట్..
స్కోరు బోర్డుకు 5 పరుగులు మాత్రమే జోడించి ఓపెనర్లు డగౌట్‌కు చేరుకున్నారు. జట్టు కెప్టెన్ ఖాతా కూడా తెరవలేదు. ఈ జట్టుకు గరిష్టంగా 13 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అదే సమయంలో, 8వ నంబర్ బ్యాట్స్‌మెన్ 7 పరుగులు చేసింది.
బోట్స్వానా ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. ఉగాండా నుంచి సమర్థవంతమైన బౌలింగ్ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. జానెట్ మబ్బాజీ కేవలం 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కిల్లర్ బౌలింగ్‌లో కాన్సీ అవెకో 5 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు.
Botswana 35/10(18.5) vs Uganda 36/1(7.3) Uganda Women won by 9 wickets#KwibukaT20 pic.twitter.com/SMHq5VKTnP
— Rwanda Cricket Association (@RwandaCricket) June 16, 2022
7.3 ఓవర్లలో ఉగాండా విజయం..
లక్ష్యాన్ని ఉగాండా కేవలం 1 వికెట్ కోల్పోయి 7.3 ఓవర్లలో 36 పరుగులు చేసి సాధించింది. జానెట్ మబ్బాజీ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆ జట్టు ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ కెవిన్ అవినో 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జానెట్ మబ్బాజీ తన ఆల్ రౌండ్ గేమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.