3 నెలల క్రితం జట్టు నుంచి ఔట్.. ఫిట్‌నెస్‌పై బోలెడు ప్రశ్నలు.. కట్ చేస్తే.. కెప్టెన్‌గా ఛాన్స్..

టీమ్ ఇండియాలో పాండ్యాకు ఘనస్వాగతం లభించింది. ఇది కేవలం తన సత్తా ద్వారానే దక్కించుకోవడంతో..

3 నెలల క్రితం జట్టు నుంచి ఔట్.. ఫిట్‌నెస్‌పై బోలెడు ప్రశ్నలు.. కట్ చేస్తే.. కెప్టెన్‌గా ఛాన్స్..
Hardik Pandya
Follow us
Venkata Chari

|

Updated on: Jun 16, 2022 | 8:29 PM

జీవితంలో అదృష్టం అనేది విజయ స్ఫూర్తి ఉన్నవారికి మాత్రమే మద్దతు ఇస్తుందనే ఓ ప్రముఖ డైలాగ్.. టీమిండియా ఆటగాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)కు కరెక్ట్‌గా సరిపోతుంది. హార్దిక్ పాండ్యా 3 నెలల క్రితం టీమ్ ఇండియాకు దూరమై.. ప్రస్తుతం కెప్టెన్‌గా సరికొత్త అవతారం ఎత్తాడు. అతని కెరీర్‌లో ఇలాంటి యు-టర్న్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఇప్పుడు ఇదే నిజం అయింది. టీమ్ ఇండియాలో పాండ్యాకు ఘనస్వాగతం లభించింది. తన ప్రదర్శనతోనే ఇంతటి అవకాశాలన్ని దక్కించుకున్నాడు. క్రికెట్‌లోని ప్రతి డిపార్ట్‌మెంట్‌లో తను అద్బుతంగా పనిచేసి, సారథిగా ఎంపికయ్యాడు. అందుకే 3 నెలల క్రితం పడిపోయి.. ప్రస్తుతం లేచి గ్రౌండ్‌కి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు.

ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన 17 మంది సభ్యుల జట్టుకు హార్దిక్ పాండ్యాకు నాయకత్వం వహించారు. 3 నెలల క్రితం వరకు ఇదే హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారింది. అతను బౌలింగ్ చేయలేకపోవడంపై రకరకాల ప్రశ్నలను జనాలు లేవనెత్తారు. అతని గాయం కూడా హార్దిక్‌పై ప్రశ్నలను లేవనెత్తింది. అయితే అందరికీ సమయం వస్తుందని భావించిన హార్దిక్.. ఆ టైం కోసం ఎదురుచూసి, తనదైన శైలిలో ఘనంగా ఎంటరీ ఇచ్చాడు.

గుజరాత్ టైటాన్స్‌తో అదృష్టం..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ రాకతో హార్దిక్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఈ టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాడిగా అతనిపై నమ్మకాన్ని ప్రదర్శించడమే కాకుండా కెప్టెన్‌గా కూడా నియమించింది. హార్దిక్‌ను కెప్టెన్‌గా చేసినప్పుడు, ప్రజలు మరోసారి అతనిని లక్ష్యంగా చేసుకున్నారు. అతడి ఫిట్‌నెస్‌, బౌలింగ్‌లపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, ఈ సమయంలోనూ ఎక్కువగా మాట్లాడలేదు. తన సత్తాను కేవలం బ్యాట్‌తోనే చూపించి, అరంగేట్రంలోనే గుజరాత్‌కు ట్రోపీని అందించాడు.

కెప్టెన్‌గా, ఆటగాడిగా మెరిశాడు..

గుజరాత్ టైటాన్స్ కొత్త జట్టు. ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. మే 29న హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఆ జట్టు ఐపీఎల్ 2022 ట్రోఫీని గెలుచుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. హార్దిక్ పాండ్యా, తన నిర్ణయాలతో ఈ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. కెప్టెన్‌గా తన నిర్ణయాలతో తన సత్తాను నిరూపించుకున్నాడు. టోర్నీలో తన బ్యాటింగ్ సరళిని ప్రపంచానికి చాటిచెప్పాడు. ఐపీఎల్‌లో ఈ ప్రదర్శన అతన్ని టీమ్ ఇండియాలో అడుగుపెట్టడమే కాకుండా, ప్రసతుతం అతను కెప్టెన్సీలో భారత క్రికెట్ అభ్యర్థిగా కూడా మారాడు. కెప్టెన్సీ అంటే అంతకు ముందు ఎవరూ గుర్తించని పాండ్యా అంతర్లీన ప్రతిభతో రీఎంట్రీ ఇచ్చాడు.