AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: జైషా ప్రకటనతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. ఐసీసీ సమావేశంలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం..

పాకిస్థాన్ ఆటగాళ్లు 2008 ఐపీఎల్ సీజన్‌లో మాత్రమే ఆడారు. జనవరి 2013 నుంచి రెండు దేశాల జాతీయ జట్లు కూడా ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ తలపడలేదు.

IPL: జైషా ప్రకటనతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. ఐసీసీ సమావేశంలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం..
Ipl Media Rights
Venkata Chari
|

Updated on: Jun 16, 2022 | 6:47 PM

Share

ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ సెక్రటరీ జైషా ఇచ్చిన ప్రకటనతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఉలిక్కిపడింది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)లో ఐపీఎల్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి రెండున్నర నెలల విండో సమయం ఉంటుందని జైషా చెప్పారు. భారత బోర్డు ఇప్పటికే ఇతర క్రికెట్ బోర్డులతో పాటు ఐసీసీతో చర్చలు జరిపిందని షా చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌కు సంబంధించిన ఈ విండో ఇతర అంతర్జాతీయ సిరీస్‌లకు అడ్డంకులు సృష్టిస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందని పీసీబీ అభిప్రాయపడింది.

పీసీబీ అధికారి ఒక భారతీయ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ, “కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జులైలో బర్మింగ్‌హామ్‌లో ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఈ విషయంపై నిర్ణయం బహుశా అక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది” అని తెలిపాడు. క్రికెట్‌లోకి డబ్బు రావడంతో PCB సంతోషంగా ఉంది. అయితే ప్రతి సీజన్‌లో IPL కోసం ప్రధాన అంతర్జాతీయ క్రికెటర్లను బుక్ చేయాలనే భారత బోర్డు ప్రణాళిక అంతర్జాతీయ సిరీస్‌లు, ఈవెంట్‌లకు ఆటంకం కలిగించవచ్చని పేర్కొంటుంది.

జైషా ఏం చెప్పారంటే?

ఇవి కూడా చదవండి

జైషా పీటీఐతో మాట్లాడుతూ, ‘మీడియా హక్కులలో బేస్ ధర చాలా ఎక్కువగా ఉందని బీసీసీఐ ఎప్పుడూ భావించలేదు. 2018లో 60 మ్యాచ్‌లు జరిగాయని అర్థం చేసుకోవాలి. వచ్చే సీజన్లలో 410 మ్యాచ్‌లు ఆడనున్నాం. మీరు డిజిటల్‌గా వస్తున్న మార్పులను కూడా గమనించాలి. 2017లో దాదాపు 56 కోట్ల మంది డిజిటల్ వీక్షకులు ఉన్నారు. 2021లో ఈ సంఖ్య 66.5కి పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుంది’ అని ఆయన అన్నారు.

‘2027లో ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు నిర్వహించాం. IPL తదుపరి ICC FTP క్యాలెండర్ నుంచి రెండున్నర నెలల అధికారిక విండోను కలిగి ఉంటుంది. తద్వారా అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లందరూ పాల్గొనవచ్చు. మేం వివిధ బోర్డులతో పాటు ఐసీసీతో చర్చించాం’ అని ఆయన పేర్కొన్నారు.

పాక్ ఆటగాళ్లు 2008లో ఐపీఎల్ ఆడారు..

ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తత కారణంగా పాక్ ఆటగాళ్లు 2008 ఐపీఎల్ సీజన్‌లో మాత్రమే ఆడగలిగారు. ఆ సమయంలో సల్మాన్ బట్, షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్ పాల్గొన్నారు. రెండు దేశాల జాతీయ జట్లు కూడా 2013 నుంచి ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ ముఖాముఖిగా తలపడలేదు. ఆసియా కప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో మాత్రమే ఇరుజట్ల మధ్య పోటీ నెలకొంది.