Ind vs Eng: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ టూర్ నుంచి వైస్ కెప్టెన్ ఔట్.. ఎందుకంటే?
KL Rahul: ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. కానీ, ప్రస్తుతం అతను మొత్తం పర్యటనకు దూరమయ్యాడు.
KL Rahul, Ind vs Eng: ఇంగ్లండ్ టూర్ ప్రారంభం కాకముందే టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా మొత్తం టూర్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్ ప్రస్తుతం చికిత్స కోసం జర్మనీకి వెళ్లనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గురువారం ఉదయం భారత జట్టులోని ఒక బ్యాచ్ టెస్ట్ మ్యాచ్ కోసం ముంబై నుంచి ఇంగ్లండ్‌కు బయలుదేరింది. ఈ బ్యాచ్‌లో కేఎల్ రాహుల్ లేడు. ఇది కాకుండా, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా ఇంగ్లాండ్ వెళ్లిన మొదటి బ్యాచ్‌లో లేడు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ తదితరులతో కలిసి రోహిత్ శర్మ 20వ తేదీన యూకే వెళ్లాల్సి ఉంది.
బుధవారం సాయంత్రం ఐర్లాండ్ పర్యటనకు ప్రకటించిన టీ20 జట్టు కూడా జూన్ 20న బయలుదేరుతుంది. రోహిత్ తన కుటుంబంతో విహారయాత్ర నుంచి ఇప్పుడే తిరిగి వచ్చాడు. తన రెండవ బ్యాచ్‌తో కలిసి సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరనున్నారు.
మొత్తం ఏడు మ్యాచ్‌ల నుంచి రాహుల్ ఔట్!
నివేదిక ప్రకారం, రాహుల్ స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ వేరే ప్లేయర్‌ను తీసుకోలేదు. ఒకవేళ రాహుల్‌ని భర్తీ చేయాలని కోరినట్లయితే, మయాంక్ అగర్వాల్‌ను జట్టులో చేరే ఛాన్స్ ఉంది. రాహుల్ దాదాపు ఏడు మ్యాచ్‌లకు దూరమైయ్యాడు. కాగా, ప్రస్తుతం సెలెక్టర్లు ఈ పర్యటనకు వైస్ కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తర్వాత, జులై 7-17 వరకు భారత్ వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన షెడ్యూల్:
24-27 జూన్ వార్మప్ మ్యాచ్ vs లీసెస్టర్‌షైర్
1- 5 జులై 5వ టెస్ట్, ఎడ్జ్‌బాస్టన్
1 జులై, T20 వార్మప్ vs డెర్బీషైర్
3 జులై, T20 సన్నాహక మ్యాచ్ vs నార్తాంప్టన్‌షైర్
7 జులై, తొలి టీ20, ఏజియాస్ బౌల్
9 జులై, 2వ T20I, ఎడ్జ్‌బాస్టన్
10 జులై, 3వ T20I, ట్రెంట్ బ్రిడ్జ్
12 జులై 1వ ODI, ది ఓవల్
14 జులై 2వ ODI, లార్డ్స్
17 జులై 3వ ODI, ఓల్డ్ ట్రాఫోర్డ్
30 ఏళ్ల కేఎల్ రాహుల్ ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ 2022లో అతను లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కి కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు 43 టెస్టులు, 42 వన్డేలు, 56 టీ20 ఇంటర్నేషనల్స్‌లో పాల్గొన్నాడు.