Viral Video: వేదికపైనే వధువును కొట్టిన వరుడు.. తిట్ల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో..
అప్పటివరకు సరదాగా కనిపించిన నూతన జోడీ.. రిసెప్షన్‌లో సరదాగా ఓ గేమ్ ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌లో వధువు గెలిచింది. దీంతో ఆగ్రహించిన వరుడు..
నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రమే జనాలకు నచ్చడంతో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని విపరీతమైన నవ్వును తెప్పిస్తాయి. అయితే మరికొన్ని మాత్రం షాకిస్తుంటాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో వివాహం అనంతరం రిసెప్షన్‌లో ఓ జంట వేదికపై ఒక గేమ్ ఆడుతున్నట్లు చూడొచ్చు. అయితే, గేమ్ ఆడుతుండగానే, ఏమైందో ఏమోగానీ, ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. వధువు గేమ్‌లో గెలిచినందుకు, తట్టుకోలేకపోయిన వరుడు ఏంచేశాడో చూస్తే, షాకవుతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వెరలవుతోంది. నెటిజన్లు వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. అసలు ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
అప్పటివరకు సరదాగా కనిపించిన నూతన జోడీ.. రిసెప్షన్‌లో సరదాగా ఓ గేమ్ ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌లో వధువు గెలిచింది. దీంతో ఆగ్రహించిన వరుడు, ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. వధువు తలపై గట్టిగా కొట్టేశాడు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ తర్వాత పెళ్లికొడుకు మాత్రం ఏమీ పట్టనట్టుగా వేదికపైనే నిలుచున్నాడు. అతను నిశ్శబ్దంగా జనాల వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఈ సమయంలో పాటలు కూడా ప్లే అవుతూనే ఉన్నాయి. కాగా, ఈ ఘటన తర్వాత ఏం జరిగిందన్న సమాచారం మాత్రం వెల్లడి కాలేదు.
ఈ ఘటనకు సంబంధించి ఉజ్బెకిస్థాన్ పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పెళ్లికి సంబంధించిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై ట్విట్టర్‌లో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది భరించలేనిది. వరుడికి తగిన శిక్ష పడాలి’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను ఈ స్థితిలో ఎలా చూడగలరు’ అంటూ మరో యూజర్ చెప్పుకొచ్చాడు. మీరూ ఈ వీడియోని చూడండి.
Horrifying moment groom beats his new wife at their WEDDING after flipping when his bride won a game on stage during toast in Uzbekistan The newlyweds were on-stage playing a game as their guests cheered them on But when the bride won the game, the groom lashed pic.twitter.com/KPL0RlrjcT
— MassiVeMaC (@SchengenStory) June 13, 2022