Viral Video: ఈ చేప మామూలిది కాదు.. పిల్లికే దిమ్మతిరిగే షాకిచ్చింది.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
అది టార్గెట్ చేసిందంటే క్షణాల్లో చేప నోట్లో ఉండాల్సిందే.. అంతలా అద్భుతంగా చేపలను పడుతుంది పిల్లి. అయితే పిల్లులు చేసే సరదా సంఘటనలు ఈ మధ్య సోషల్ మీడియాలో..

పిల్లికి వేట పుట్టుకతోనే వస్తుందంటారు. అందుకే పులితో సమానంగా పిల్లిని పోల్చుతారు. అందులోనే చెరువులో చేపలు పట్డడం పిల్లి ఓ పెద కళ.. అది టార్గెట్ చేసిందంటే క్షణాల్లో చేప నోట్లో ఉండాల్సిందే.. అంతలా అద్భుతంగా చేపలను పడుతుంది పిల్లి. అయితే పిల్లులు చేసే సరదా సంఘటనలు ఈ మధ్య సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తాజా ఓ పిల్లి చేసిన ప్రయత్నం ఎలా విఫలమైందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియా నెట్‌వర్కింగ్‌లో చాలా ఫన్నీ మారింది. చేపను పట్టాలని తొంగి చూసిన పిల్లికి పెద్ద షాక్ ఇచ్చింది చేప. ఇలాంటి వీడియోలను చాలా అరుదుగా చూస్తుంటారు. అవును, పిల్లిపై చేప దాడి చేసింది. ఈ వీడియోలో చేపల దాడిని చూపించిన తీరు.. మీరు మొదట షాక్ అవుతారు.. ఆపై నవ్వు ఆపుకోకుంటారు.
ఈ వీడియోను ఇక్కడ చూడండి..




View this post on Instagram
ఓ గదిలో అక్వేరియంలోని చిన్న అందమైన గోల్డ్ చేప పట్టాలని ప్లాన్ చేసుకున్న పిల్లికి చేదు అనుభవం ఎదురైంది. పిల్లి వేసిన ప్లాన్‌ను ముందే పసిగట్టిన గోల్డెన్ ఫిష్.. అదిరిపోయే రీతిలో తిప్పికొట్టింది. నెమ్మదిగా అక్వేరియంలోకి తొగ్గి చూసిన పిల్లిపై చేప దాడి చేసింది. చేప దాడి చేయడంతో పిల్లి భయంతో ఒక్కసారిగా బిత్తరపోయింది. ఈ చేప చేసిన ఎదురు దాడకి నెటిజన్లు తెగ ఇష్టపడతారు. ఇప్పుడు ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.ఈ వీడియోను ఇప్పటి వరకు 35 వేల మందికి పైగా చూశారు. ఇది meowcat_happypet ఖాతా నుంచి Instagramలో పోస్ట్ చేశారు.