IND Vs SA 4th T20: పంత్ పేలవ బ్యాటింగ్‌తో ఆందోళన.. ప్రాక్టీస్‌లో చెమటలు కక్కించిన హెడ్‌కోచ్..
పంత్ పేలవమైన ఫామ్ చూసి.. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ కూడా టెన్షన్ పడటంతో అతడిని రిథమ్‌లోకి దించే పనిని స్వయంగా హెడ్ కోచ్ తీసుకున్నాడు. రాజ్‌కోట్ టీ20కి ముందు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఆటగాడితో చాలా సమయం గడిపాడు.
రిషబ్ పంత్ క్రీజులో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడల్లా ప్రత్యర్థి శిబిరం ఒకరకమైన భయంతో కనిపిస్తుంది. ఈ బ్యాట్స్‌మెన్‌ను ఆపడానికి ప్రత్యర్థి బౌలర్లు ఎంతగానో ఆలోచిస్తుంటారు. కానీ, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ బ్యాట్స్‌మెన్ ఘెరంగా విఫలమవుతున్నాడు.
1 / 5
రిషబ్ పంత్ 3 టీ20 మ్యాచ్‌ల్లో 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని బ్యాట్‌లో కేవలం 2 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే వచ్చాయి. గత రెండు మ్యాచ్‌ల్లో పంత్ 5, 6 పరుగులు మాత్రమే చేసి మరీ చెత్త షాట్లు ఆడుతూ వికెట్ కోల్పోయాడు.
2 / 5
పంత్ పేలవమైన ఫామ్ చూసి.. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ కూడా టెన్షన్ పడటంతో అతడిని రిథమ్‌లోకి దించే పనిని స్వయంగా హెడ్ కోచ్ తీసుకున్నాడు. రాజ్‌కోట్ టీ20కి ముందు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఆటగాడితో చాలా సమయం గడిపాడు.
3 / 5
రాహుల్ ద్రవిడ్ తన షాట్ సెలక్షన్‌లో పంత్‌తో చాట్ చేస్తూ కనిపించాడు. ఇద్దరి మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. ఈ ఆటగాడు తన బ్యాటింగ్‌పై చాలా కష్టపడ్డాడు.
4 / 5
పంత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా నెట్స్‌లో అదనంగా ప్రాక్టీస్ చేశాడు. ఈ సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ 3 మ్యాచ్‌ల్లో 30 సగటుతో 90 పరుగులు చేశాడు. అయ్యర్ బ్యాటింగ్‌లో కనిపించే సమస్య ఏమిటంటే అతను స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడమే. అలాగే అతని స్ట్రైక్ రేట్ 125 కంటే తక్కువగా నిలిచింది.