ESIC Recruitment 2022: నెలకు రూ.రూ.2,08,700ల జీతంతో.. ఈఎస్ఐసీలో 491 ఉద్యోగాలు షురూ..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) దేశ వ్యాప్తంగా ఉన్న పలు పీజీఐఎంఎస్‌ఆర్‌లు, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి..
ESIC Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) దేశ వ్యాప్తంగా ఉన్న పలు పీజీఐఎంఎస్‌ఆర్‌లు, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 491
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు: అనాటమీ, అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, ఫిజియాలజీ, పాథాలజీ, స్టాటిస్టీషియన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Regional Director, ESI Corporation, Panchdeep Bhawan, Sector 16, Faridabad, Haryana – 121002.
దరఖాస్తు రుసుము: రూ. 500
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 18, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.