Indian Army Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. ఇండియన్ ఆర్మీలో గ్రూప్‌ ‘సీ’ సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్‌..

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ(36 FAD Recruitment 2022) మధ్యప్రదేశ్‌లోని సెంట్రల్‌ కమాండ్‌ ప్రధానకార్యాలయం.. గ్రూప్‌ 'సీ' సివిలియన్ పోస్టు (Group 'C' Civilian posts)ల భర్తీకి అర్హులైన..

Indian Army Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. ఇండియన్ ఆర్మీలో గ్రూప్‌ 'సీ' సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్‌..
Indian Army
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 18, 2022 | 8:10 AM

Indian Army Group ‘C’ Civilian Recruitment 2022: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ(36 FAD Recruitment 2022) మధ్యప్రదేశ్‌లోని సెంట్రల్‌ కమాండ్‌ ప్రధానకార్యాలయం.. గ్రూప్‌ ‘సీ’ సివిలియన్ పోస్టు (Group ‘C’ Civilian posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 88

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రూప్‌ ‘సీ’ సివిలియన్ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • కుక్‌ పోస్టులు: 4
  • వార్డ్‌ సహాయక్‌ పోస్టులు: 84

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి 29,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టునుబట్టి రాత పరీక్ష/ఫిజికల్ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు 150 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

ప్రశ్నల సరళి ఇలా:

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 3, 2022. (నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి 45 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.