TS Edcet 2022: తెలంగాణ ఎడ్‌సెట్‌-2022 దరఖాస్తు గడువు పొడిగింపు..

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 22 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎ రామకృష్ణ ప్రకటించారు. ఇప్పటివరకు..

TS Edcet 2022: తెలంగాణ ఎడ్‌సెట్‌-2022 దరఖాస్తు గడువు పొడిగింపు..
Ts Edcet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 18, 2022 | 7:41 AM

TS Edcet 2022 Application last date: తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 22 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎ రామకృష్ణ ప్రకటించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో edcet.tsche.ac.in దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జూన్ 15వ తేదీతో (ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా) దరఖాస్తు ముగుస్తుంది. తాజా ప్రకటనతో జూన్ 22 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్‌ తెలిపారు.

రూ.250 ఆలస్య రుసుముతో జూలై 1 వరకు, అలాగే రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తెలంగాణ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్‌ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షకు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా అర్హులే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.