AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS govt jobs 2022: తెలంగాణలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ! త్వరలో నోటిఫికేషన్‌..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ తెల్పింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పలు నోటిఫికేషన్లను విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ కొత్తగా మరో..

TS govt jobs 2022: తెలంగాణలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ! త్వరలో నోటిఫికేషన్‌..
Ts Govt Jobs
Srilakshmi C
|

Updated on: Jun 18, 2022 | 7:26 AM

Share

Telangana government Job Notifications 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ తెల్పింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పలు నోటిఫికేషన్లను విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల్లో గురుకుల పాఠశాలలకు సంబంధించిన పోస్టులు 9,096 వరకు ఉన్నాయి. వీటిల్లో బీసీ గురుకులాల్లో 3,870 పోస్టులు, గిరిజన గురుకులాల్లో 1,514 పోస్టులు, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులున్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన 995 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు త్వరలో విడుదలవ్వనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.