అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు ఊడిపోతున్నాయి.. ఆ గ్రామాలకేమైంది
ఆ గ్రామాలకేమైంది...? అప్పుడు జుట్టు రాలిపోయింది..! ఇప్పుడు గోళ్లు కూడా ఊడిపోతున్నాయి...! అసలేం జరుగుతోంది...? గుబురుగా ఉన్న జుట్టుకాస్తా ఉన్నట్టుండి కుప్పలు కుప్పలుగా రాలిపోవడమేంటి...? పొడవాటి గోళ్లు పుట్టుక్కున ఊడిపోవడమేంటి...? ఇప్పుడిదే మిస్టరీగా మారి... డాక్టర్లకు సైతం సవాల్ విసురుతోంది. మహారాష్ట్ర బుల్ఢాణా జిల్లాలో కొన్ని గ్రామాలను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి.
శరీరంలో ఎప్పుడు ఎలాంటి మార్పు జరుగుతుందో తెలియక బెంబేలెత్తిపోతున్నారు జనాలు. మొన్న ఉన్నట్టుండి వందలాది మందికి ఆకస్మాత్తుగా జుట్టు ఊడిపోయిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ప్రజలంతా గోళ్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కలవరపెడుతోంది…! బుల్ఢాణా జిల్లాలోని నాలుగు గ్రామాల ప్రజలు గోళ్లు ముడతలు పడటం, ఊడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల దగ్గర్నంచి ముసలివాళ్ల వరకు ఎంతో మంది ఈ గోళ్ల సంబంధిత సమస్యలతో కొన్నిరోజులుగా అవస్థలు పడుతున్నారు. ఏం జరుగుతుందో… ఎందుకు జరుగుతుందో తెలియక ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన డాక్టర్లు… అందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో తెలిసుకునే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే శరీరంలో సెలీనియం లెవల్స్ పెరగడమే ఈ సమస్యకు కారణంగా భావిస్తున్నారు అక్కడి వైద్యులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్
New Toll Policy: వాహనదారులకు శుభవార్త.. ఇకపై టోల్
మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్
Meenakshi Chaudhary: డాక్టర్ నుంచి యాక్టర్.. మీనాక్షి గురించి ఈ విషయాలు తెలుసా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

