AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: గ్రామీణ ప్రాంతానికి అత్యుత్తుమ వైద్యం.. గుంటూరు వైద్యుడికి సర్థార్ పటేల్ యూనిటీ అవార్డ్

టాప్ నాచ్ పౌండేషన్ ప్రతి ఏటా ఆరోగ్యం, విద్యా, వ్యాపార రంగాలలో విశిష్ట సేవలను గుర్తించి వారికి అవార్డ్స్ ఇస్తుంది. గత కొన్నేళ్లుగా ఆయా రంగాల్లో లబ్దప్రతిష్ఠులైన వారికి అవార్డ్స్ ఇస్తూ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఈ అవార్డులను ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ పాటిబండ్ల మోహన్ రావుకు ఈ ఏడాది సర్థార్ పటేల్ యూనిటీ అవార్డ్ దక్కింది.

Guntur: గ్రామీణ ప్రాంతానికి అత్యుత్తుమ వైద్యం.. గుంటూరు వైద్యుడికి సర్థార్ పటేల్ యూనిటీ అవార్డ్
Dr. Mohana Rao Patibandla
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 24, 2025 | 7:45 PM

Share

గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ పాటిబండ్ల మోహన్ రావుకు అరుదైన అవార్డు దక్కింది.  మినిమల్లి ఇన్వాసివ్ న్యూరోసర్జన్‌గా ఆయన సేవలను గుర్తించిన టాప్ నాచ్ పౌండేషన్ ఆయన్ను సర్థార్ పటేల్ యూనిటీ అవార్డ్‌కి ఎంపిక చేసింది. అత్యాధునికి వైద్య విధానాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో మోహన్ రావు గుంటూరు సిటిలో రావూస్ ఆస్పత్రి ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. బ్రెయిన్ పాత్ సిస్టమ్ ద్వారా న్యూరో సర్జరి విభాగంలో అనేక క్లిష్టతరమైన శస్త్ర చికిత్సలను అతి తక్కువ ఖర్చుతోనే అందిస్తున్నారు. దీంతో ఈ ఆసుపత్రికి వివిధ రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు.

దేశంలో వివిధ ప్రాంతాల నుండే కాకుండా విదేశాలకు చెందిన రోగులు కూడా రావూస్ హస్పిటల్‌కు శస్త్రచికిత్సల కోసం వస్తున్నారు. ఇజ్రాయేల్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలను నుండే కాకుండా ఆఫ్రికా దేశాలకు చెందిన రోగులు కూడా గుంటూరుకు వైద్యం కోసం వస్తున్నారు. చిన్న నగరమైనా గుంటూరు అతి ఖర్చుతో అత్యుత్తమైన శస్త్ర చికిత్సలు చేస్తున్న వైద్యుడిగా మోహన్ రావు పేరు గాంచారు. అమెరికాలో న్యూరో సర్జరీ విభాగంలో అనుభవాన్ని సంపాదించిన డాక్టర్ మోహన్ రావు అక్కడ నుండి తమ సొంత ప్రాంతమైన గుంటూరుకు వచ్చి ఇక్కడే ఆసుపత్రిని ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు.

టాప్ నాచ్ పౌండేషన్ కూడా ఆరోగ్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డ్స్ అందిస్తుంది. రెండో రోజుల క్రితం గోవాలో జరిగిన కార్యక్రమంలో గోవా సిఎం ప్రమోద్ సావంత్ చేతులుగా మీదుగా పాటిబండ్ల మోహన్ రావు అవార్డ్ అందుకున్నారు. తమ సొంత ప్రాంతంలో వైద్యం అందిస్తున్న తనను గుర్తించి అవార్డ్ కు ఎంపిక చేసిన ఫౌండేషన్ సభ్యులకు మోహన్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Follow Us
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..
విటమిన్ మాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
విటమిన్ మాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలో
రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలో
ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు..
ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు..
ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్
ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్
అలిపిరి పేరు ఎలా వచ్చింది? చింత చెట్టు నుంచి రామానుజాచార్యుల వరకు
అలిపిరి పేరు ఎలా వచ్చింది? చింత చెట్టు నుంచి రామానుజాచార్యుల వరకు
Mahindra UDO ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు
Mahindra UDO ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. కొత్తగా 4.5 లక్షల చేయూత పింఛన్లు
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. కొత్తగా 4.5 లక్షల చేయూత పింఛన్లు
Dubstep Buzz X11 ఇయర్‌‌బడ్స్​లో మతిపోగొట్టే ఫీచర్లు
Dubstep Buzz X11 ఇయర్‌‌బడ్స్​లో మతిపోగొట్టే ఫీచర్లు
రూ.6 లక్షల బడ్జెట్​లో ఫ్యామిలీ కారు కొనాలంటే ఏది బెస్ట్​
రూ.6 లక్షల బడ్జెట్​లో ఫ్యామిలీ కారు కొనాలంటే ఏది బెస్ట్​