అన్వేషి జైన్ గురించి కుర్రకారుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
హిందీ బిగ్‌బాస్‌తో ఫేమసైన ఈ భామ.. ఇపుడు తెలుగులో రవితేజ హీరోగా నటిస్తోన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ఐటెం సాంగ్‌తో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది.
అన్వేషి తన కెరీర్‌ను ఇండోర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ప్రారంభించింది. అయితే, ఆమె తన కుటుంబానికి చెప్పకుండా ముంబైకి వెళ్లి మీడియా రంగంలోకి అడుగుపెట్టింది.
2018లో ALT బాలాజీ వెబ్ సిరీస్ "గందీ బాత్ 2"లో నీతా పాత్రలో నటించి ఆమె గుర్తింపు పొందింది. ఈ సిరీస్ తో వన్ నైట్ లోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
ఆ తరువాత నెమ్మదిగా కమిట్మెంట్ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ మూవీ తర్వాత రవితేజ రామారవు ఆన్ డ్యూటీ మూవీ చేసింది.
రీసెంట్ గా డ్రాగన్ మూవీలో నటించింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది.