ఖరీదైన బంగారం ఎందుకు..? రాగి ఉంగరం ధరించడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..
ఉంగరం రకాన్ని బట్టి ఏ చేతికి వేసుకుంటే మంచిదో కూడా నియమాలను పాటిస్తుంటారు. అయితే, ఈ ఉంగరాలు బంగారం, వెండి, రాగితో కూడా తయారు చేయించుకుని ధరిస్తుంటారు. వీటిలో రాగి ఉంగరం ధరించటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ ఉపయోగాలేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

సాధారణంగా మనలో చాలా మంది చేతి వేళ్లకు ఉంగరాలు ధరిస్తుంటారు. మహిళలే కాదు.. మగవారు కూడా ఉంగరాలు పెట్టుకుంటారు. కొందరు తమ రాశి, నక్షత్రాన్ని బట్టి ఆయా ఉంగరాన్ని ధరిస్తుంటారు. ఉంగరం రకాన్ని బట్టి ఏ చేతికి వేసుకుంటే మంచిదో కూడా నియమాలను పాటిస్తుంటారు. అయితే, ఈ ఉంగరాలు బంగారం, వెండి, రాగితో కూడా తయారు చేయించుకుని ధరిస్తుంటారు. వీటిలో రాగి ఉంగరం ధరించటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ ఉపయోగాలేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
రాగి ఉంగరం ధరించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని, ఆయుర్వేద ఆరోగ్య నిపుణులతో పాటు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రాగిలో ఉండే ఖనిజాలు శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో రాగి తోడ్పడుతుందని చెబుతున్నారు. రాగి ఉంగరం వేసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతుందని అంటున్నారు.
జ్యోతిశాస్త్రం ప్రకారం రాగి ఉంగరం వేసుకోవడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. రాగి ఉంగరం ధరించడం వల్ల సూర్యని నుండి పాజిటివ్ శక్తిని పొంది.. చెడును తొలగిస్తుందని నమ్ముతారు. పనిలో ఒత్తిడిగా ఉన్నప్పుడు రాగి ఉంగరం వేసుకుంటే మంచి ఫలితాలు కలిగిస్తుందని చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాగి సూర్యుడి శక్తికి సంకేతం. రాగి ఉంగరం ధరిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అంతేకాదు సమాజంలో గౌరవమర్యాదలు, కీర్తి పెరుగుతాయి. ముఖ్యంగా రాగి ఉంగరం అన్ని రకాల నెగెటివ్ వైబ్రేషన్ల నుంచి కాపాడుతుంది.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








