వేసవిలో తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన పండు ఇది..! ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి..
ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, పచ్చిగా ఉండే లిచీ పండ్ల జోలికి అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. లిచీ పండ్లు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులను కలిగిస్తాయని చెబుతున్నారు.

స్ట్రాబెరీ రూపంలో అందంగా మెరిసిపోయే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. కేవలం రుచిలో మాత్రమే కాదు.. లిచీ పండ్లు ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో విటమిన్స్, ఖనిజాలకి గొప్ప మూలం అని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో నీటిశాతం అధికంగా ఉండి, జ్యూసీగా ఉండే లిచీ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు ఎంత రుచికరమైనదో అంతే ఔషధ గుణాలతో నిండి ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ లిచీ పండ్ల ప్రత్యేకత, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
వేసవిలో వచ్చే చాలా రకాల పండ్లలో లిచీ కూడా ఒకటి. అధిక నీరు, జ్యూస్ ఎక్కువగా ఉండే లిచీ పండ్లను తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది జీవక్రియను బలపరుస్తుంది. ఇది త్వరగా పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. ఫలితంగా బరువును తగ్గిస్తుంది. లిచీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లిచీలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లిచీలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.
లిచీ తక్కువ కేలరీలు కలిగిన పండు. దీంతో ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు, లిచీ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. నరాల సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. గుండెను ఆరోగ్యం ఉంచేందుకు అవసరమైన పాలిపినాల్స్ లిచీలో అధికంగా ఉన్నాయి. పాలిపినాల్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా అరికడతాయి. ఈ పండ్లను తరచూ తినటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య ఉండదని చెబుతున్నారు. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరిచేందుకు లిచీ సహకరిస్తుంది. శరీరంలోని బాక్టీరియాలు, వైరస్‌లను నానశనం చేస్తుంది.
లిచీలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, పచ్చిగా ఉండే లిచీ పండ్ల జోలికి అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. లిచీ పండ్లు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులను కలిగిస్తాయని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








