Health Tips : కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయకపోతే ఇక అంతే.. మీ గుండె డేంజర్‌లో పడ్డట్టే..!
ఆరోగ్యం మహా భాగ్యం అంటారు మన పెద్దలు. చిన్న చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
ఆరోగ్యం మహా భాగ్యం అంటారు మన పెద్దలు. చిన్న చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆహారంలో మార్పులు, ఏది తినాలి, ఎంత సమపాళ్లలో తినాలి అన్నది తెలిస్తే శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలా మందిలో తలెత్తే సమస్య బరువు పెరగడం. అధికంగా బరువు పెరగడం కారణంగా అనేక సమస్యలు వస్తుంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. చాలా మంది కొలెస్ట్రాల్ ఎక్కువై గుండె సమస్యలతో కన్నుమూసిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇక కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయి. వీటిలో HDL కొలెస్ట్రాల్ ,LDL కొలెస్ట్రాల్ .. దీనిలో LDL కొలెస్ట్రాల్ వాళ్ళ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల గుండె రక్తనాళ్ళాలు మూసుకుపోయి ప్రమాదం ఉంది.
ఆహార పదార్ధాల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. మనం తినే ఆహరం లో కొలెస్ట్రాల్ లేకుండా చూసుకుంటే శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు , బరువు కూడా తగ్గవచ్చు. పాలు, పాలపదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్లులోని పచ్చసొన వల్ల కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుంది. వాటిని తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన టిప్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఈజీగా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిలో వెల్లుల్లి.. ఇది రక్తంలోని నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ప్రతి రోజూ సగం వెల్లుల్లిని తీంటే.. కొలెస్ట్రాల్ స్థాయి 10% తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొత్తిమీర, ధనియాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతాయి. ధనియాలను నీటిలో మరిగించి ఆ నీటిని రోజు తాగడం ద్వారా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. టొమాటోలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాప్సికమ్, సెలెరీ, క్యారెట్లు, ఆకు కూరలు, ఉల్లిపాయలు వంటివి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి ఉపయోగ పడుతుంటాయి.
(హెల్త్ టిప్స్ ఫాలో అయ్యేముందు నిపుణులను, వైద్యులను సంప్రదించడం)