AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Cooking Oil: ఈ వంట నూనెలు వాడారంటే హార్ట్‌ ఎటాక్‌ పరార్‌!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పరిమిత పరిమాణంలో మాత్రమే నూనెను వినియోగించాలి. నూనెను అధికమొత్తంలో వాడితో శరారంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు సంభవించే ప్రమాదం ఉంది. అధికంగా వేడిచేసిన నూనె..

Best Cooking Oil: ఈ వంట నూనెలు వాడారంటే హార్ట్‌ ఎటాక్‌ పరార్‌!
Cooking Oil
Srilakshmi C
|

Updated on: Jun 28, 2022 | 9:25 PM

Share

Use These Cooking Oil For A Healthy Heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పరిమిత పరిమాణంలో మాత్రమే నూనెను వినియోగించాలి. నూనెను అధికమొత్తంలో వాడితో శరారంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు సంభవించే ప్రమాదం ఉంది. అధికంగా వేడిచేసిన నూనె వాడకం ఆరోగ్యానికి మరింత హానికరం. దానిలోని పోషక విలువలు కోల్పోయి, హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. సరైన నూనెను ఉపయోగించడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చు. మీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే కొన్ని నూనెలు..

ఆలివ్ నూనె ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, పార్కిన్సన్స్ వ్యాధి, అల్జీమర్స్ వివిధ కంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించే యాంటీఆక్సిడెంట్లను ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన కొవ్వులు నిండుగా ఉంటాయి.

సోయాబీన్ నూనె సోయాబీన్ నూనె గుండెకు కూడా చాలా మంచిది. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీనిలో నిండుగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పొద్దుతిరుగుడు నూనె సన్‌ఫ్లవర్ ఆయిల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇతర నూనెలతో పోలిస్తే, సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో గుండెకు మేలు చేసే విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.

ఆవాల నూనె ఈ నూనె కేవలం గుండెకు మాత్రమే కాకుండా చర్మం, కీళ్లు, శరీరంలోని ఇతర భాగాలకు కూడా మేలు చేస్తుంది. అనేక వంటకాలలో కూడా ఆవాల నూనెను వాడవచ్చు. ఈ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఆవాల నూనె జీర్ణక్రియ, ఆకలిని మెరుగుపరుస్తుంది.

రైస్ బ్రాన్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ గుండెకు ఉత్తమమైన వంట నూనెలలో ఒకటి. పోషకాహార నిపుణులు ఈ నూనెలో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌ల నుంచి మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయని చెబుతారు.

పొద్దుతిరుగుడు పువ్వునూనె శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలో ఈ నూనె సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధమనులు గట్టిపడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.