Science of Friendship: స్నేహ బంధాలకు కెమిస్త్రీ లాజిక్‌ ఉంటుందని మీకు తెలుసా? నమ్మలేని వాస్తవమిది..

ఏ ఆపద వచ్చినా భుజం తట్టి నేనున్నానని.. వెనకే ఉండి ముందుకు నడిపే మీ స్నేహితులకు మీకు స్నేహం ఎందుకు, ఎలా ఏర్పడిందో.. దాని వెనుక సైన్స్‌ ఏమిటో.. ఆ విషయాలు ఎలా నిర్ధారణ అయ్యిందో మీ కోసం..

Science of Friendship: స్నేహ బంధాలకు కెమిస్త్రీ లాజిక్‌ ఉంటుందని మీకు తెలుసా? నమ్మలేని వాస్తవమిది..
Science Of Friendship
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2022 | 8:59 PM

పక్షద్వయశశిదృశాన్యనిశం హార్దాని సదసతాం లోకేI ఆప్యాయంతే తు సతామసతాం చ పరిక్షయం యాన్తిII

సజ్జనులతో చేసే స్నేహాలు శుక్లపక్ష చంద్రునిలా క్రమంగా వృద్ధి పొందుతాయి. దుర్జనుల స్నేహాలు కృష్ణపక్ష చంద్రుడిలా క్షీణిస్తూ ఉంటాయని ఓ శతక కర్త బోధించాడు. రెండక్షరాల స్నేహం రెండు క్షణాలకు మాత్రమే పరిమితంకాకుండా రెండు జీవితాల ఆత్మీయ అనురాగాలను పెనవేసుకుపోయి ఆజన్మాతం అమృతప్రాయమౌతుంది. అసలు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి స్నేహం ఎలా ఏర్పడుతుంది? లవ్‌ ఎట్ ఫస్ట్‌ సైట్‌ లాగా స్నేహం ఏర్పడటానికి కూడా ఏదైనా ఫార్ములా ఉందా? అనే విషయంపై అధ్యయనం చేసిన ఇజ్రాయెల్‌ పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌ ప్రచురించిన కథనం ప్రకారం..

True Friendship

True Friendship

శరీర వాసనలను బట్టి స్నేహ బంధాలు ఏర్పడతాయని వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఇన్బాల్ రావ్రేబీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. మనుషులుకాకుండా ఇతర జంతువులు, పక్షులు, క్షీరదాలు వాటి వాటి శరీరాల నుంచి వచ్చే వాసనలను బట్టి తోటి జీవులను గుర్తిస్తాయి. అలాగే మనుషుల మధ్య ఏర్పడే స్నేహ బంధాలు కూడా సారూప్యతను కోరుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. 22 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న 20 జతల స్నేహితులపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడిందని అంటున్నారు. 20 జతల స్నేహితులకు ప్రత్యేకంగా కాటన్ టీ-షర్టును ధరింపజేసి, ప్రత్యేక నిబంధనల మధ్య ఒక రోజు తర్వత వారి నుంచి ఆ టీ షర్టు నమూనాలను సేకరించి ఎలక్ట్రానిక్‌ నోస్‌ (e Nose)తో పరీక్షించారు. ఈ పరికరం కెమికల్‌ కాంపోజిషన్‌ను గుర్తిస్తుంది. స్నేహితులు కాని వారితో పోల్చితే స్నేహితుల టీ షర్టు వాసనలు (odors) చాలా దగ్గరగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి
Friendship

Friendship

సువాసనలను బట్టి కూడా స్నేహాలు ఏర్పడతాయి స్నేహితుల శరీరాల నుంచి వచ్చే వాసన ఎంత దగ్గరగా ఉంటే.. వారి మధ్య స్నేహం కెమిస్ట్రీ అంత గాఢంగా ఉంటుందట. వీరి అధ్యయనం సారాంశం ఏంటంటే..సారూప్యమైన శరీర వాసనలు కలిగిన వ్యక్తులు స్నేహితులుగా మెలుగుతారని, భాషను మినహాయిస్తే భూసంబంధమైన క్షీరదాల మాదిరిగానే మానవ స్నేహాలు కూడా వాసన ఆధారితమైనవని తేల్చారు. మీరేమంటారు.. సైంటిస్టులు చెప్పిన ఈ ల్యాబ్‌ టెస్టులను మీరు నమ్ముతారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ల రూపంలో వ్యక్తం చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!