Cochin Shipyard Jobs: 4వ,7వ,10వ తరగతి అర్హతతో కొచ్చిన్‌ షిప్‌యార్డులో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Cochin Shipyard Limited).. ఒప్పంద ప్రాతిపదికన సెమీ స్కిల్డ్‌ రిగ్గర్, సేఫ్టీ అసిస్టెంట్ తదితర (Semi-skilled rigger Posts) పోస్టుల భర్తీకి..

Cochin Shipyard Jobs: 4వ,7వ,10వ తరగతి అర్హతతో కొచ్చిన్‌ షిప్‌యార్డులో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Cochin Shipyard
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 28, 2022 | 6:40 PM

Cochin Shipyard Limited Assistant Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Cochin Shipyard Limited).. ఒప్పంద ప్రాతిపదికన సెమీ స్కిల్డ్‌ రిగ్గర్, సేఫ్టీ అసిస్టెంట్ తదితర (Semi-skilled rigger Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 106

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • సెమీ స్కిల్డ్‌ రిగ్గర్ పోస్టులు: 53
  • సేఫ్టీ అసిస్టెంట్‌ పోస్టులు: 18
  • స్కాఫోల్డర్ పోస్టులు: 5
  • ఫైర్‌మెన్ పోస్టులు: 29
  • కుక్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జులై 8, 2022 నాటికి 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌:

  • మొదటి ఏడాది నెలకు రూ.22,100
  • రెండో ఏడాది నెలకు రూ.22,800
  • మూడో ఏడాది నెలకు రూ.23,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి 4వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.200
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.