TS Inter Results 2022: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తాచాటిన అవిభక్త కవలలు వీణ-వాణి
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు (జూన్ 28)న విడుదలైన సంగతి తెలిసిందే. నేటి ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు..
Hyderabad Twin Sisters Vina Vani: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు (జూన్ 28)న విడుదలైన సంగతి తెలిసిందే. నేటి ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వీణ-వాణీలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వీణ-వాణీల భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తామని, వారి కలలను సాకారం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వీణ-వాణిలకు సహకారం అందించిన అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003వ సంవత్సరంలో తలలు అతుక్కుని వీణ-వాణి ఇద్దరు కవలలు పుట్టారు. పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ల వరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో గడిపారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్ హోమ్‌లో గడుపుతున్నారు. వీరిని విడదీయాలనే వైద్యుల ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలంకాలేదు. ఇక ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వీణ-వాణి కవలలకు ఇంటర్ బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఈ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన వీణ వాణిలు చాటెడ్ అకౌంట్స్ చదవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.
టెన్త్ క్లాస్ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.