Scorpion Pose: వామ్మో! మామూలోడు కాదుగా..! స్టంట్‌ వేశాడు.. గిన్నీస్‌ రికార్డు కొట్టాడు..వైరల్ వీడియో..

కష్ట సాధ్యమైన యోగా వేసి.. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు ఓ యోగా శిక్షకుడు. దుబాయ్‌లో ఉన్న భారతీయ యోగా శిక్షకుడు యష్ మన్సుఖ్ భాయ్ మొరాదియా దాదాపు 30 నిమిషాల పాటు..

Scorpion Pose: వామ్మో! మామూలోడు కాదుగా..! స్టంట్‌ వేశాడు.. గిన్నీస్‌ రికార్డు కొట్టాడు..వైరల్ వీడియో..
Longest Scorpion Pose
Follow us

|

Updated on: Jun 27, 2022 | 9:35 PM

longest Scorpion Pose: కష్ట సాధ్యమైన యోగా వేసి.. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు ఓ యోగా శిక్షకుడు. దుబాయ్‌లో ఉన్న భారతీయ యోగా శిక్షకుడు యష్ మన్సుఖ్ భాయ్ మొరాదియా దాదాపు 30 నిమిషాల పాటు అత్యంత ఎక్కువ సమయం స్కార్పియన్ భంగిమ వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి..

ఈ వీడియోలో యష్ మన్సుఖ్ యోగా మ్యాట్‌పై స్కార్పియన్ యోగా భంగిమలో ఉండటం కనిపిస్తుంది. కష్టసాధ్యమైన ఈ ఆసనాన్ని అలవోకగా వేసి అందరినీ అబ్బురపరిచాడు యష్ మన్సుఖ్. స్కార్పియన్ యోగా భంగిమలో దాదాపు 29 నిమిషాల 4 సెకన్లు ఉన్నట్లు గిన్నీస్‌ అధికారులు వెల్లడించారు. యష్ మన్సుఖ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వృచ్చికాసనాన్ని స్కార్పియన్ పోజ్ అని కూడా అంటారు. ఇది చాలా పవర్‌ఫుల్‌ యోగాసనం. రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ ద్వారా దీనిని చేయగలిగాను. వీపు వెనుక భాగం నుంచి కాళ్లను ముందుకు తీసుకువచ్చి వేస్తారు. చూసేందుకు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న తేలు భంగిమలో ఉంటుందీ ఆసనం అని’ వివరించాడు. సాధారణంగా రోజు వారీ యోగా సమయంలో వృచ్చికాసనాన్ని 30 సెకన్ల పాటు వేసి, అనంతరం రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్తారు. అదే భంగిమలో ఎక్కువ సమయం ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఇన్‌స్టాగ్రాం వీడియోకు వేలల్లో కామెంట్లు, లక్షల్లో వీక్షణలు రావడంతో సోషల్ మీడియాలో కాస్తా వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి.