Hummingbird: ప్రపంచంలోనే అతి చిన్న గుండె కలిగిన పక్షి.. ఇది చేసే పనులు చూస్తే బుర్రలు వేడెక్కేస్తాయ్..
తిమింగలం గుండె కారు అంత పొడవుగా ఉంటుంది. కెనడాలోని టొరంటోలోని రాయల్ ఒంటారియో మ్యూజియంలో ఉన్న నీలి తిమింగలం గుండె బరువు దాదాపు 190 కిలోలు. ఐతే ప్రపంచంలోనే అత్యంత చిన్న గుండె ఏ పక్షికి ఉంది? దాని బరువెంత? ఈ ఆసక్తికర విషయాలు మీకోసం..
Hummingbird
Follow us
ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఆకారాలు కలిగిన జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే వీటి బరువుల్లోనూ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. మీరు తిమింగలాలను ఎప్పుడైనా చూశారా? ఇవి ప్రపంచంలోని అతిపెద్ద, బరువైన జీవురాశుల్లో ఒకటి. తిమింగలం గుండె కారు అంత పొడవుగా ఉంటుంది. కెనడాలోని టొరంటోలోని రాయల్ ఒంటారియో మ్యూజియంలో ఉన్న నీలి తిమింగలం గుండె బరువు దాదాపు 190 కిలోలు. ఐతే ప్రపంచంలోనే అత్యంత చిన్న గుండె ఏ జంతువుకు ఉంది? దాని బరువెంత? ఈ ఆసక్తికర విషయాలు మీకోసం..
ప్రపంచంలోనే అతి చిన్న గుండె ఉన్న పక్షి.. హమ్మింగ్‌బర్డ్. దీనిని ప్రపంచంలోనే అతి చిన్న పక్షి అని కూడా అంటారు. హమ్మింగ్‌బర్డ్ సాధారణంగా 2 నుంచి 2.5 అంగుళాల పొడవు ఉంటుంది. కొన్ని 8 అంగుళాల పొడవు ఉన్నా, 20 గ్రాముల వరకు మాత్రమే బరువుంటుంది. అంటే రూపాయి బిళ్ల కంటే కూడా తక్కువ బరువుంటుంది. ఇంత చిన్న పక్షి గుండె ఎంత బరువుంటుందో ఊహించగలరా? దాని గుండెను కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం.
హమ్మింగ్ బర్డ్ నిలబడి నిద్రపోతుంది. నిజానికి హమ్మింగ్‌బర్డ్ పాదాలు చాలా బలహీనంగా, నడవలేని విధంగా ఉంటాయి. ఐతే పాదాలతో చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకుని నిద్రపోగల సామర్థం వీటికుంటుంది. హమ్మింగ్ బర్డ్ జీవితకాలం కేవలం 4-5 సంవత్సరాలు మాత్రమే.
ఈ పక్షి ప్రతి 10 నిమిషాలకు ఓ సారి ఏదైనా తినడం, త్రాగడం చేస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. హెలికాప్టర్ పైన ఉండే ఫ్యాన్ సహాయంతో ఒకే చోట ఉండగలిగినట్లుగా.. హమ్మింగ్ బర్డ్ కూడా రెక్కలను చాలా వేగంగా ఆడించడం ద్వారా ఒకే చోట ఎక్కువ సమయం గాలిలో నిలిచి ఉండగలవు.
దూర ప్రయాణాలు చేయడంలో వీటికి పోటీగా మరో పక్షిలేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క రోజు వ్యవధిలో హమ్మింగ్ బర్డ్ దాదాపు 1400ల మైళ్లు ప్రయాణించగలదు. ఏ పక్షి కూడా ఇంత దూరం ప్రయాణించలేదు.