Viral Story: మీ క్వాలిఫికేషన్ ఏంటని ప్రశ్నించిన ఓ నెటిజన్.. ఆసక్తికర బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడూ రకరకాల పోస్ట్‌లు పెడుతూ నెటిజన్ల నుండి వచ్చే కామెంట్స్‌ని కూడా స్వీకరిస్తారు. కొందరు అడిగే సందేహలకు సమాధానం కూడా ఇస్తుంటారు. కొన్నిసార్లు హృదయాన్ని హత్తుకునే ఫోటోలు..
ఆనంద్ మహీంద్రా , మహీంద్రా గ్రూప్ చైర్మన్ , ప్రపంచ ప్రసిద్ధ వ్యాపారవేత్తలలో ఒకరు. వ్యాపారవేత్తలు చాలా బిజీగా ఉంటారనీ, వారికి ఎవరితోనూ మాట్లాడే సమయం కూడా ఉండదు… అటువంటి పరిస్థితిలో, సోషల్ మీడియాను ఉపయోగించడానికి కూడా చాలా దూరంగా ఉంటారు. కానీ ఆనంద్ మహీంద్రా విషయంలో అలా కాదు. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడూ రకరకాల పోస్ట్‌లు పెడుతూ నెటిజన్ల నుండి వచ్చే కామెంట్స్‌ని కూడా స్వీకరిస్తారు. కొందరు అడిగే సందేహలకు సమాధానం కూడా ఇస్తుంటారు. కొన్నిసార్లు హృదయాన్ని హత్తుకునే ఫోటోలు, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన వీడియోలను కూడా మహీంద్ర షేర్ చేస్తుంటారు. అటువంటి హృదయాన్ని హత్తుకునే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఆనంద్ మహీంద్రా అందంగా అభివర్ణించారు. ఈ చిత్రంలో ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా అడవిలో కూర్చుని చదువుతున్నట్లు కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోకు కామెంట్‌గా ఒక వినియోగదారు ఆనంద్ మహీంద్రాను అతని అర్హత గురించి అడిగారు. వినియోగదారు, ‘నేను మీ అర్హతను తెలుసుకోవచ్చా?’ ఇప్పుడు ఆనంద్ మహీంద్రా కూడా దీనికి చాలా సరళంగా, తేలికగా సమాధానం ఇచ్చారు. అతను ప్రతిస్పందనగా, ‘స్పష్టంగా చెప్పాలంటే, నా వయస్సులో అర్హత అనుభవం మాత్రమే’ అని రాశారు.
ఆనంద్ మహీంద్రా విద్యార్హతల గురించి ప్రశ్నలు అడిగిన, రకరకాల వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఇప్పుడు ట్విట్టర్‌లో ప్రజలు విరుచుకుపడ్డారు. ‘అతను అర్హతకు మించినవాడు’ అని ఎవరో రాశారు, ఆపై ఒకరు ‘అతని విద్యార్హత సర్టిఫికేట్లు కాదు.. అవి అతనికి కేవలం కాగితాలు మాత్రమే. ఆయన కింద 40 వేల మంది క్వాలిఫైడ్ వాళ్లు పని చేయడం ఆయన ఘనత. అదేవిధంగా, అనేక ఇతర వినియోగదారులు వివిధ రకాల ప్రతిచర్యలను అందించారు. భగవాన్ సే క్యూ పుచ్తే ఉంకీ శక్తి .ఔర్ భక్తో సే క్యా పుచ్తే ఉంకీ భక్తి…అగర్ మహీంద్రా శ్రీ కే బేరే మే జాంటే తో నా పుచ్తే ఉంకీ అర్హత..దునియా తో తారా కే ఇన్సాన్ హాట్….ఏక్,,,జో ఖుద్ బటే కి వో కౌన్ హై ఔర్ దుస్రా జో దునియా బతతీ కి వో కౌన్ హై ..
Beautiful photograph, Abhishek. She is my #MondayMotivation https://t.co/NMViCvaAwO
— anand mahindra (@anandmahindra) June 27, 2022
అసలు ఈ చర్చకు కారణమైన ఆ బాలిక ఫొటోలో…పర్వత ప్రాంతంలో ఓ గుట్టపై కూర్చుని చదువుకుంటున్న ఆ బాలిక.. ఈ ఫొటో హిమాచల్ ప్రదేశ్‌కు చెందినగా తెలిసింది. కాగా, సోషల్ మీడియాలో పోస్టు చేసిన అభిషేక్ దూబే అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రాను కూడా ట్యాగ్ చేశారు. దానిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ఈ ఫొటో ఎంతో బాగుందని, ఆ బాలికను తాను ప్రేరణగా తీసుకుంటానని వెల్లడించారు. ఈ క్రమంలోనే వైభవ్ అనే నెటిజన్ ఆనంద్ మహీంద్రా క్వాలిఫికేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి