Viral Video: హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. చుట్టుముట్టిన మూడు చిరుతపులులు.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించలేరు..!
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది అందరినీ షాక్‌కి గురి చేసింది. ప్రమాదకరమైన చిరుతల మధ్య హాయిగా నిద్రిస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇది..ఇలాంటి దృశ్యం మీరు ఇంతకు ముందు చాలా అరుదుగా చూసి ఉంటారు.
భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన జంతువులలో చిరుత ఒకటి. వాటి అద్భుతమైన సామర్థ్యం, చిరుత వేగానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు ఇవి. ఇవి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. వాటి వేగం కారణంగా ఏ జంతువునైనా క్షణంలో వేటాడతాయి. భయంకరమైన వన్యప్రాణి కావడం వల్ల మనిషి కూడా దీనికి భయపడతాడు. అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. వీడియోలో ఓ వ్యక్తి ప్రమాదకరమైన చిరుతపులి మధ్య హాయిగా నిద్రపోతున్నట్టుగా ఈ వీడియో మనకు చూపిస్తుంది. అంతే కాదు ఆ వ్యక్తి కూడా అదేదో పెంపుడు కుక్క, పిల్లిని పక్కలో పెట్టుకుని పడుకున్నట్టుగా చిరుతపులిని పట్టుకున్నాడు.. ఇలాంటి దృశ్యం మీరు ఇంతకు ముందు చాలా అరుదుగా చూసి ఉంటారు.
కొన్ని చిరుతలు నేలపై హాయిగా నిద్రిస్తుండగా, వాటి పక్కనే ఓ వ్యక్తి కూడా దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఒక చిరుతపులి నిద్రలోంచి ఉలిక్కి పడి లేచింది. అకస్మాత్తుగా నిద్రలేచి అటూ ఇటూ చూస్తుంది..మళ్లీ అది ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతని చేతిపై వాలి హాయిగా నిద్రపోతుంది. అతడు కూడా ఆ చిరుతను గట్టిగా పట్టుకుని హాయిగా నిద్రపోతాడు. ఆ వెంటనే పక్కనే పడుకుని ఉన్న మిగిలిన చిరుతలు కూడా లేచి ఆ వ్యక్తికి మరింత దగ్గరగా చేరి ఒకదానికొకటి అతుక్కుని హాయిగా నిద్రపోవడం కనిపిస్తుంది. వీటన్నింటి మధ్యలో ఆ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా నిద్రపోతున్నట్లు చూడొచ్చు.. నిజంగా ఈ వీడియోను ఎవరూ విశ్వసించలేరు.
Are you kidding me bro??pic.twitter.com/k1vOEmchXH
— Figen (@TheFigen) June 25, 2022
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. 53 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా వీక్షించారు. 12 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన జనాలు రకరకాలుగా స్పందించారు. ఒక వినియోగదారు ‘వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్’ అని రాస్తే, మరొకరు ‘ఇది నిజమైన టార్జాన్’ అని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి