Char Dham Yatra: పవిత్ర చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి..! 600లకు పైగా గుర్రాలు కూడా.. హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం..ఆదివారం నాడు 4,308 మంది యాత్రికులు బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. రెండునెలల్లోనే కేదార్‌నాథ్‌ యాత్ర మార్గంలో..

Char Dham Yatra: పవిత్ర చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి..! 600లకు పైగా గుర్రాలు కూడా.. హైకోర్టు ఆగ్రహం
Char Dham Yatra
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2022 | 5:43 PM

Char Dham Yatra: ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది. అయితే రెండు నెలలు కూడా గడువకముందే 203 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం..ఆదివారం నాడు 4,308 మంది యాత్రికులు బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. రెండునెలల్లోనే కేదార్‌నాథ్‌ యాత్ర మార్గంలో 97 మంది, బద్రీనాథ్‌ ధామ్‌ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది మరణించినట్టు ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతోనే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నది.

ఈ నేపథ్యంలోనే మే 3 నుంచి ఇప్పటివరు 25 లక్షల మందికిపైగా యాత్రికులు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారని వెల్లడించింది. అయితే వాతావరణంలో మార్పులు, వర్షాలు పడుతుండటంతో గత వారంరోజులుగా యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. కాగా, యాత్రకు రావడానికి ముందే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సూచించింది. ఉత్తరాఖండ్‌ ఆరోగ్య శాఖ మంత్రి నోటీసుతో చార్‌ధామ్ ప్రాంతంలో వైద్య సదుపాయాలను పటిష్టం చేస్తున్నారు. ప్రస్తుతం, కేదార్‌నాథ్,గౌరీకుండ్‌ పరిసర ప్రాంతాలలో మొత్తం పది వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే సామాజిక కార్యకర్త గౌరీ మౌలేఖి చార్‌ధామ్‌ నిర్వహణ అధికారులకు లేఖ రాశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత మందిని అనుమతించాలి? ఎంతమందికి భోజనం, పానీయాలు, బస అందిస్తారో నిర్ధారించాలి. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త గౌరీ మౌలేఖి కోరారు. చార్‌ధామ్‌ యాత్ర సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి ప్రజలు ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

మరోవైపు, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్‌ధామ్ యాత్రలో జంతువులు అల్లకల్లోలం చేయటం. కొన్ని జంతువులు మృతి చెందడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 600లకు పైగా గుర్రాల మృతిపై కేంద్రం, రాష్ట్రం సహా చార్‌ధామ్‌ యాత్రలోని నాలుగు జిల్లాల డీఎంలకు నైనిటాల్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..