విషాదం: ఆత్మహత్య చేసుకున్న సినీ నటుడు.. డ్రగ్స్‌తో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొద్దిరోజులుగా కరోనా బారిన పడి పలువురు సినీ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసింది. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

విషాదం: ఆత్మహత్య చేసుకున్న సినీ నటుడు.. డ్రగ్స్‌తో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు
Nd Prasad Dead
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2022 | 2:46 PM

Action hero: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొద్దిరోజులుగా కరోనా బారిన పడి పలువురు సినీ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసింది. ఇంకా పలు అనారోగ్య సమస్యల కారణంగానూ చిత్రపరిశ్రమలో ప్రముఖులు కన్నుమూశారు. కాగా, మరికొందరు సెలబ్రిటీలు ఆత్మహత్యలతో అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇటీవల ఒడియా చిత్ర పరిశ్రమకు సంబంధించిన 58 ఏళ్ల నటుడు రాయ్‌మోహన్‌ పరిదా, 23 సంవత్సరాల బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా బలవన్మరణంతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మలయాళ నటుడు ఎన్‌డీ ప్రసాద్‌ కొచ్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. కలస్సేరిలోని తన నివాసంలో ఉరివేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రసాద్‌ బలవన్మరణానికి మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు చెప్తున్నారు. గతంలో డ్రగ్స్‌తో పట్టుబడటంతోపాటు పలు కేసుల్లో ప్రసాద్‌పై అభియోగాలు ఉన్నాయి. గతేడాది ఎర్నాకుళం ఎక్సైజ్‌ సర్కిల్‌ అధికారులు నిర్వహించిన దాడిలో 15 గ్రాముల గంజాయి, రెండున్నర గ్రాముల హాష్‌ ఆయిల్, ఒక్క గ్రాము బుప్రెనార్‌ఫిన్‌, కొడవలితో పట్టుబడినట్లు సమాచారం. నటుడు ప్రసాద్‌పై అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

కాగా, 2016లో వచ్చిన నివిన్‌ పౌలీ చిత్రం ‘యాక్షన్ హీరో బిజు’లో ఎన్‌డి ప్రసాద్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఇబా, కిర్మాణి చిత్రాల్లో నటించాడు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి